ETV Bharat / bharat

మిడతల దండును తరిమికొట్టే పద్ధతులు ఇవిగో..

author img

By

Published : May 29, 2020, 2:56 PM IST

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంటే మిడతల రూపంలో మరో సమస్య ముందుకొచ్చింది. వాటిని ఎదుర్కోవడంపై మహారాష్ట్రలోని ఓ విశ్వవిద్యాలయం కీలక సూచనలు చేసింది. పొగ పెట్టడం, వేప నూనెను పంటకు పిచికారీ చేయటం, గుడ్లను ధ్వంసం చేయటం వల్ల మిడతల బెడదను తప్పించుకోవచ్చని తెలిపింది.

locust menace
మిడతల దండు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. ఇదే సమయంలో పంటల మీద పడి టన్నుల కొద్దీ ఆహారాన్ని నాశనం చేసే మిడతల దండు స్వైర విహారం చేస్తోంది. ఇప్పటికే రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, మహారాష్ట్రలోకి ప్రవేశించిన ఈ కీటకాల గుంపు మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీఎన్​ఏయూ మార్గదర్శకాలు..

ఇంతటి విధ్వంసం సృష్టించే మిడతలను ఎదుర్కోవటానికి మహారాష్ట్ర పర్భణిలోని వసంత్​రావ్​ నాయక్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పలు పద్ధతులను రైతులకు సూచించింది. ఈ మేరకు వ్యవసాయ ఎంటమాలజీ విభాగం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

  • ఆడ మిడతలు తేమతో కూడిన ఇసుక భూమిలో 50-100 గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పొదిగే కాలం వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. 2 నుంచి 4 వారాలు పట్టొచ్చు. లార్వా బయటకు వచ్చినప్పుడు అవి వెంటనే ఎగరలేవు. ఈ గుడ్లను గుంపులుగా ఉన్నప్పుడే పగలగొట్టాలి.
  • 60 సెం.మీ వెడల్పు, 75 సెం.మీ లోతుతో కందకాలు తవ్వాలి. దండులోని చిన్న మిడతలను వీటి ద్వారా పట్టుకోవచ్చు. లార్వా నుంచి బయటకు వచ్చిన తర్వాతే మిడతలు గుంపులో చేరుతాయి. అప్పుడే ఆకులు, కొమ్మలు, పువ్వులు, విత్తనాలను తింటాయి.
  • పెద్ద మిడతలు వాటి బరువుకు సమానంగా తింటాయి. గంటకు 12 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో వెళతాయి. చదరపు కిలోమీటర్​ వైశాల్యంలో ఉండే మిడతల దండు 3 వేల క్వింటాళ్ల ఆహారాన్ని తింటాయి.
  • అవి విశ్రాంతి తీసుకునే రాత్రివేళల్లో పొగ ద్వారా వీటిని మట్టుబెట్టవచ్చు. ఈ సమయంలో పంటపొలాలకు నిప్పు అంటుకోకుండా రైతులు జాగ్రత్త పడాలి.
  • హెక్టారుకు 2.5 లీటర్ల వేప నూనెను పిచికారీ చేయాలి. ఇది మిడతల దండును నియంత్రించడంలో సమర్థంగా పనిచేస్తుంది.

ఇదీ చూడండి: దండుపై దండయాత్ర- యూకే నుంచి ప్రత్యేక స్ప్రేయర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.