ETV Bharat / bharat

బాలికపై 10 మంది అత్యాచారం- ఐదుగురు అరెస్ట్ - మహారాష్ట్రలో ఓ ఎస్సీ బాలికపై సాముహిక అత్యాచారం

మహారాష్ట్రలో ఓ ఎస్సీ బాలికపై సాముహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 16ఏళ్ల బాలికపై 10మంది 6 నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. వీరిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

gang rape
బాలికపై 10 మంది అత్యాచారం- ఐదుగురు అరెస్ట్
author img

By

Published : Feb 12, 2020, 2:41 PM IST

Updated : Mar 1, 2020, 2:19 AM IST

తండ్రిని కోల్పోయి, తీవ్ర కష్టాల్లో ఉన్న ఓ ఎస్సీ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. ఏకంగా 10 మంది ఆరు నెలల పాటు ఆమెను లైంగికంగా తీవ్రంగా వేధించారు. మహారాష్ట్ర సోలాపుర్​ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆరు నెలలుగా

సోలాపూర్​ జిల్లాలోని ఓ గుడి వద్ద 16ఏళ్ల బాలిక ఏడుస్తూ కనిపించగా... స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ బాలికను విచారించిన పోలీసులు విస్తుపోయారు. గత 6 నెలలుగా 10 మంది బలవంతంగా వేర్వేరు చోట్లకు తీసుకువెళ్లి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా తెలిపింది ఆ బాలిక. వారిలో కొంతమంది తన స్నేహితులని వెల్లడించింది.

తక్షణమే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన 10మంది కోసం గాలించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో కొంతమంది ఆటోడ్రైవర్లు ఉన్నట్లుగా వెల్లడించారు పోలీసులు.

కొంతకాలం క్రితం బాలిక తండ్రి మరణించాడు. తల్లి వద్దే ఉంటూ జీవనోపాధి కోసం చిన్నచితకా పనులు చేసుకుంటోంది.

ఇదీ చూడండి: నేడు ఆమ్​ఆద్మీ శాసనసభా పక్షనేత ఎన్నిక

Last Updated : Mar 1, 2020, 2:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.