మధ్యప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.
భోపాల్‌లోని 'బడా తలాబ్' సరస్సు నిండుకుండలా మారి నగరంలోని చిరయు ఆసుపత్రిలోకి నీరు చేరింది. ఆసుపత్రి వార్డుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
-
#WATCH Madhya Pradesh: Water enters Chirayu Hospital in Bhopal as the level of 'Bada Talab' rises due to incessant rainfall in the region. (29.08.2020) pic.twitter.com/04wBEJexVL
— ANI (@ANI) August 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Madhya Pradesh: Water enters Chirayu Hospital in Bhopal as the level of 'Bada Talab' rises due to incessant rainfall in the region. (29.08.2020) pic.twitter.com/04wBEJexVL
— ANI (@ANI) August 29, 2020#WATCH Madhya Pradesh: Water enters Chirayu Hospital in Bhopal as the level of 'Bada Talab' rises due to incessant rainfall in the region. (29.08.2020) pic.twitter.com/04wBEJexVL
— ANI (@ANI) August 29, 2020
సెహోర్ జిల్లాలోని అస్తా నగరంలో వరదల కారణంగా ఓ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
షాజాపుర్ జిల్లాలోని చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. జిల్లా కేంద్రం, పరిసర లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
మోదీకి ఫోన్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో..మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ప్రధానికి వివరించారు.
ఇదీ చూడండి: అన్‌లాక్-4: 7 నుంచి మెట్రో కూత- థియేటర్లకు నో