ETV Bharat / bharat

భారతీయ విద్యార్థికి ఆ వర్సిటీ నుంచి రూ.1.3 కోట్లు! - LPU MSc Agri student bags Rs 1.3 crore scholarship to pursue PhD at Australian National University

ఆస్ట్రేలియా జాతీయ వర్సిటీలో సీటు దొరకడమే మహా కష్టం. అలాంటిది ఆ వర్సిటీలో ఫ్రీ సీటు సంపాదించాడు ఓ భారతీయ వ్యవసాయ విద్యార్థి. ఒకటి కాదు రెండు కాదు అక్షరాల రూ. 1.3 కోట్ల స్కాలర్​షిప్​ సొంతం చేసుకున్నాడు.

LPU MSc Agri student bags Rs 1.3 crore scholarship to pursue PhD at Australian National University
భారత విద్యార్థికి ఆ వర్సిటీ నుంచి రూ. 1.3 కోట్లు!
author img

By

Published : Jul 23, 2020, 5:34 PM IST

Updated : Jul 23, 2020, 8:19 PM IST

పంజాబ్​కు చెందిన ఓ వ్యవసాయ విద్యార్థి ఆస్ట్రేలియా జాతీయ వర్సిటీ నుంచి రూ.1.3 కోట్ల స్కాలర్​షిప్​కు అర్హత సాధించాడు.

పంజాబ్​లోని లవ్లీ ప్రొఫెషనల్​ వర్సిటీ (ఎల్​పీయూ) లో అగ్రికల్చర్​ ఎం​ఎస్​సీ చదువుతున్న సుమంత్​ బిందాల్.. తన ప్రతిభతో ఆస్ట్రేలియా జాతీయ వర్సిటీలో పీహెచ్​డీ సీటు సంపాదించాడు. తన పరిశోధనకు అయ్యే ఖర్చు మొత్తం వర్సిటీయే భరిస్తూ.. సుమంత్​కు అక్షరాలా రూ. 1.3 కోట్ల స్కాలర్​షిప్ ప్రకటించింది.​

"ఓ వ్యవసాయ విద్యార్థికి ఇంత భారీ మొత్తంలో స్కాలరిషిప్ రావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది సెప్టెంబర్​లో పీహెచ్​డీ ప్రోగ్రామ్​ ప్రారంభంకానుంది."

-ఎల్​పీయూ

అగ్రి-జెనెటిక్స్, ప్లాంట్​ బ్రీడింగ్​ విభాగంలో పీజీ చదవుతున్న సుమంత్​.. అరుదైన అంశంపై అధ్యయనం చేయనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టమోట మొక్కలకు సోకుతున్న ఫ్యూసేరియం తెగులుకు విరుగుడు కనిపెట్టే దిశగా సాగనుంది సుమంత్​ పరిశోధన. ప్యూసేరియం వల్ల భారతదేశంలో ఏటా.. టమోట పంట దిగుబడి దాదాపు 45 శాతం వరకు తగ్గుతోంది.

ఇదీ చదవండి: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు

Last Updated : Jul 23, 2020, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.