బంగాల్‌కు చెందిన బీతీ దాస్ అనే యువతి ఎముకల కేన్సర్‌తో బాధపడుతోంది. వైద్యులు కీమో థెరపీ చేస్తున్నప్పుడే.. ఆమె బతకడం కష్టమని తేల్చేశారు. తాను బతకనని తెలుసుకున్న బీతీ... తన ప్రియుడిని పెళ్లాడి.. ఆత్మ సంతృప్తితో మృత్యుఒడికి చేరేందుకు సిద్ధమైంది.
ఇదే తన ఆఖరి కోరికగా వెల్లడించింది. తన ప్రియురాలి చివరి కోరికను బరువెక్కిన హృదయంతో అంగీకరించిన ఆ ప్రేమికుడు... వివాహానికి సూచనగా బీతీ పాపిటలో తిలకం దిద్ది భార్యగా చేసుకున్నాడు. తన ప్రేమికుడిని పెళ్లాడిన సంతృప్తితో అతడి చేతిలో చేయి వేసి రెండు గంటల అనంతరం కన్నుమూసింది బీతీ.
చేయి విడువని ప్రేమికుడు...
కేన్సర్ వ్యాధి బయటపడిన అనంతరం బీతీదాస్ చేయి విడువలేదు సుబ్రతా కుందు. బీతీ కుటుంబ సభ్యులకు తాను బీతీ స్నేహితుడినని తెలిపి... ఆమెకు చికిత్స అందించేందుకు దేశంలోని పలు కేన్సర్ ఆసుపత్రులకు తిరిగాడు. ఆ సమయంలోనే కుందు... తమ కుమార్తె ప్రేమికుడని గుర్తించారు బీతీ తల్లిదండ్రులు. కుమార్తె మృతి అనంతరం కుందూ రూపంలో తమకు ఒక కుమారుడు దొరికారని చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి: భారత్‌తో దౌత్య సంబంధాల తెంపునకు పాక్ నిర్ణయం