గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇటలీలోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడి చేసి విధ్వంసం సృష్టించిన ఘటనపై ఇటలీ అధికార వర్గాలకు భారత్ గట్టిగా నిరసన తెలిపింది. భారత దౌత్యవేత్తల రక్షణ అక్కడి ప్రభుత్వ విధి అని స్పష్టం చేసింది.
వేడుకలు మొదలుకావడానికి కాస్త ముందు ఈ దాడి జరిగింది. దాడిలో పాల్గొన్న దుండగులు ఖలిస్థాన్ జెండాలు ఎగురవేశారు. 'ఖలిస్థాన్ జిందాబాద్' అంటూ గోడలపై రాతలు కూడా రాశారు. ఈ దాడి దృశ్యాలు ఉన్న వీడియో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.