ETV Bharat / bharat

మిడతల దండు దాడి చేసినా.. పంట నష్టం జరగలేదు!

author img

By

Published : Jun 10, 2020, 5:33 PM IST

మహారాష్ట్రలోని ఓ గ్రామంపై మిడతల దండు దాడి చేసింది. కానీ ఎటువంటి పంట నష్టం చేయకుండా వెళ్లిపోయాయి. ఏంటీ ఆశ్చర్య పోతున్నారా? అవునండీ.. ముందస్తు జాగ్రత్తగా ఈ గ్రామంలో డ్రోన్ల సాయంతో మందులను పిచికారీ చేయటం వల్లే ఎలాంటి పంట నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Locusts swarms reach Nagpur, drones used to spray pesticides
మిడతల దండు దాడి చేసినా.. పంట నష్టం జరగలేదు!

మిడతల దండు దాడి నుంచి పంట నష్టం వాటిల్లకుండా చాకచక్యంగా వ్యవహరించారు మహారాష్ట్ర నాగ్​పూర్​ జిల్లాకు చెందిన అజ్నీ గ్రామస్థులు. తమ గ్రామానికి సమీపంలోనే మిడతలు ఉన్నాయన్న అధికారుల సమాచారంతో ముందస్తు చర్యలు తీసుకుని ఈ గండం నుంచి గట్టెక్కారు. ముందుగానే డ్రోన్ల సాయంతో పంట మొక్కలపై రసాయనాలను పిచికారీ చేయడం వల్ల.. మిడతలు చేసేది లేక అదే జిల్లాలోని మౌడా గ్రామానికి పయనమైనట్లు అధికారులు తెలిపారు.

మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్​లోనూ విస్తరించిన పెంచ్​ టైగర్​ రిజర్వ్​ నేషనల్​ పార్క్​ను మంగళవారం చుట్టి ముట్టాయి మిడతలు. కానీ అక్కడ జంతువులు ఉన్నందున మందుల పిచికారీ చేయలేదని అధికారులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సౌజన్యంతో బుధవారం ఉదయం డ్రోన్ల సాయంతో అజ్నీ ప్రాంతంలోని చెట్లు, పంటలపై రసాయనాలతో పిచికారీ చేసినట్లు వ్యవసాయ శాఖ డివిజినల్​ జాయింట్ డైరెక్టర్​ రవి బోస్లే పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో వరి విత్తనాలను వేసినప్పటికీ ఇంకా మొలకెత్తలేదని, అందువల్ల ఎటువంటి పంట నష్టం జరగలేదని వెల్లడించారు. రేగి, నల్ల తుమ్మ చెట్టు, అంజనీ చెట్ల మీద మిడతలు ఎక్కువగా నివాసముంటాయని బోస్లే తెలిపారు. ​

ఇదీ చూడండి:అయోధ్యలో రామ మందిరానికి భూమిపూజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.