ETV Bharat / bharat

అస్థికలు కలిపేందుకు హరిద్వార్​కు ప్రత్యేక బస్సు - జైపుర్​ నుంచి హరిద్వార్​కు ప్రత్యేక బస్సు

అస్థికలను గంగానదిలో కలిపేందుకు జైపుర్​ నుంచి హరిద్వార్​కు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు రాజస్థాన్​కు చెందిన ఎమ్మెల్యే అశోక్ లాహోటి. ఈ మేరకు 27 మంది అస్థికలతో వారి కుటుంబీకులు 35 మందిని హరిద్వార్​కు పంపారు.

RJ-LOCKDOWN-ASHES-BUS
హరిద్వార్​కు ప్రత్యేక బస్సు
author img

By

Published : May 18, 2020, 11:58 PM IST

చనిపోయిన 27 మంది అస్థికలు జైపుర్​ నుంచి హరిద్వార్​కు ప్రత్యేక బస్సులో తరలించారు. సంబంధిత బంధువులు 35 మందికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు భాజపా ఎమ్మెల్యే అశోక్ లాహోటి తెలిపారు.

లాక్​డౌన్​ కారణంగా కుటుంబీకుల అస్థికలు గంగలో కలిపేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఉత్తరాఖండ్ మంత్రి మదన్​ కౌశిక్ సాయంతో హరిద్వార్​లో వీరందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పించినట్లు లాహోటి తెలిపారు.

అన్ని జాగ్రత్తలో..

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మాస్కులతో పాటు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

మరిన్ని..

పుష్కరాలు జరగబోతున్న నేపథ్యంలో భవిష్యత్తులో హరిద్వార్​కు ఇలాంటి సర్వీసులు మరిన్ని నడపనున్నట్లు తెలుస్తోంది. మరో 30 మంది రాజస్థాన్​ ఎమ్మెల్యేలు కూడా ఈ సర్వీసులు నడిపేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోనున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.