ETV Bharat / bharat

'మందుబాబులు మారేందుకు ఇదే అద్భుత అవకాశం' - corona lock down effects

మందు మానేసేందుకు లాక్​డౌన్​ కాలం ఓ అద్భత అవకాశం అంటున్నారు బెంగళూరుకు చెందిన ఓ మనోవైద్యులు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. మద్యం మానేసే క్రమంలో కలిగే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

lockdown is an golden opportunity to quit drinking says bengaluru Psychiatrist  Dr. Jagadis
'మందుబాబులు మారేందుకు ఇదే అద్భతమైన అవకాశం'
author img

By

Published : Apr 9, 2020, 2:26 PM IST

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి భయం. దేశాలన్నీ లాక్​డౌన్ పేరిట బందీ అయ్యాయి. అయితే, ఈ భీకర పరిస్థితుల వల్ల మానవ మనుగడ కష్టంగా మారినప్పటికీ.. ఈ పరిణామాల వల్ల ఓ మంచి కూడా జరిగిందనే అంటున్నారు బెంగళూరుకు చెందిన ప్రముఖ మనో వైద్యుడు డాక్టర్​ జగదీశ్. దేశంలో ఏళ్లుగా పాతుకుపోయిన మద్యపాన వ్యసనానికి చరమగీతం పాడే గొప్ప అవకాశం వచ్చిందని చెబుతున్నారు. అందుకే, మద్యం దుకాణాలు తెరుచుకోకముందే ఆ అలవాటును పూర్తిగా అంతం చేయాలని సూచిస్తున్నారు

ఇప్పుడు మారితే మంచిది...

"ఈ దేశంలో ప్రతి ఐదుగురిలో ఒక పురుషుడు, ప్రతి 20 మందిలో ఒక మహిళ మద్యం సేవిస్తున్నారు. వీరిలో దాదాపు 12 శాతం మంది మద్యానికి బానిసలుగా మారే అవకాశం ఉంది.

సాధారణంగా మద్యానికి బానిసలైనవారు.. ఉన్నట్టుండి మందు మానేయాలంటే కాస్త కష్టమే. మద్యం లేకపోతే వారిలో విపరీతమైన భావోద్వేగాలు, శారీరక మార్పులు కలిగే అవకాశాలున్నాయి. వణుకు, చెమట, ఆత్రుత, నిద్రలేమి, గందరగోళం వంటి సమస్యలు కనిపిస్తాయి. మరికొందరిలో అయితే ఎవరో కనిపిస్తున్నట్లు భ్రాంతి కలగడం, దిక్కుతోచని స్థితిలోకి వెళ్లడం, ఏవో శబ్ధాలు వినబడడం, మూర్ఛపోవడం వంటి విత్​డ్రాల్ సిమ్​టమ్స్ ఉంటాయి.

అయితే ఈ లక్షణాలన్నీ కేవలం​ 6 గంటల నుంచి 96 గంటల్లోగా బయటపడతాయి. ఆ సమయంలో వైద్యులను సంప్రదించి చిన్నపాటి చికిత్స పొందితే తగ్గిపోతుంది" అంటున్నారు జగదీశ్​. అయితే లాక్​డౌన్​ ఆరంభమై రెండువారాలు దాటింది కాబట్టి ఇప్పటికే చాలా మంది ఆ లక్షణాలను జయించి మందు మానేశారని, మిగతావారు కూడా మందు మానేసేందుకు ఇదో చక్కటి అవకాశమని చెబుతున్నారు.

'మందుబాబులు మారేందుకు ఇదే అద్భతమైన అవకాశం'

"గత రెండు వారాలుగా అన్ని మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మద్యానికి బానిసలైన ఎంతో మంది ఈ రెండు వారాల్లో మద్యం మానేసేటప్పుడు వచ్చే శారీరక, మానసిక మార్పులను అధిగమించారు. కొంత మంది మాత్రం ముందుగానే తెచ్చుకుని తాగుతున్నారు. అలాంటి వారు మందు మానేసేందుకు ఈ లాక్​డౌన్​కాలం అనేది అద్భుత అవకాశం.. ఇలా మద్యం మానేయడం వల్ల కలిగే ఫలితాలను మీరే గమనించవచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిద్ర బాగా పడుతుంది. కుటుంబంతో మీ సంబంధాలు బలపడతాయి. మీరు బాగుంటేనే కదా మీ కుటుంబం బాగుంది."

-జగదీశ్​, మనో వైద్యుడు

ఇదీ చదవండి:ఆ దుకాణంలో అమ్మేవాళ్లు లేరు... కానీ కొనుక్కోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.