రాష్ట్రవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ పొడిగించింది బంగాల్ ప్రభుత్వం. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆగస్టు 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులకు ఓ సారి విధించే లాక్డౌన్ని బంధనలు కూడా అప్పటి వరకు కొనసాగుతాయని తెలిపారు.
రాష్ట్రంలో విద్యా సంస్థలు ఆగస్టు 31 వరకు మూసే ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థలు ఎప్పుడు తెరవాలనే విషయంపై సెప్టెంబర్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటి వరకు ప్రతి శని, ఆది వారాల్లో లాక్డౌన్ విధించగా.. బక్రీద్, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సారి ప్రత్యామ్నాయ రోజుల్లో లాక్డౌన్ విధిస్తున్నట్లు బంగాల్ అధికారులు వెల్లడించారు.
బంగాల్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:'దేశంలో రికార్డు స్థాయిలో 179 కళాశాలలు మూత'