నితీశ్‌కు గుడ్‌బై- భాజపాతో జట్టు?
బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నిర్ణయించింది. జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ తరఫున ఎన్నికల బరిలో నిలవకూడదని నిర్ణయించింది. ఈ మేరకు చిరాగ్ పాసవాన్ నేతృత్వంలో జరిగిన ఎల్జేపీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే భాజపాతో కలిసి కూటమి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సమావేశంలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
జేడీయూ పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలపాలని, భాజపా పోటీ చేసే స్థానాల్లో బరిలో నిలవకూడదని నిర్ణయించినట్లు సమాచారం. బిహార్ ప్రస్తుత సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌తో చిరాగ్ పాసవాన్‌కు పొసగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఒంటరిపోరుకు ఎల్జేపీ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది