ETV Bharat / bharat

లష్కరే తోయిబాకు సహకరించిన ఓ వ్యక్తి అరెస్ట్​ - జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాది అరెస్ట్​

జమ్ముకశ్మీర్​ పాంపోర్​ ప్రాంతంలో లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తోన్న వ్యక్తిని భద్రతా దళాలు అరెస్ట్​ చేశాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటం సహా అక్రమంగా ఆయుధాలు తరలించటంలో ఇతని భాగస్వామ్యం ఉందని అధికారులు తెలిపారు.

LeT militant associate arrested
లష్కరే తోయిబాకు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Oct 17, 2020, 12:17 PM IST

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద కదలికల నిర్మూలన చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా దక్షిణ కశ్మీర్​ పాంపోర్​ ప్రాంతంలో లష్కరే తోయిబా(ఎల్​ఈటీ)కి అనుబంధంగా పనిచేస్తోన్న ఓ ఉగ్రవాదిని అరెస్ట్​ చేసినట్లు జమ్ముకశ్మీర్​ పోలీసులు తెలిపారు.

" పుల్వామా జిల్లాలోని పాంపోర్​ ప్రాంతంలో ఎల్​ఈటీకి చెందిన క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తిని అరెస్ట్​ చేశాం. అతను ఎల్​ఈటీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటం సహా ఇతర సహాయం అందిస్తున్నాడు. జిల్లాలోని పాంపోర్​, ఖ్రేవ్​, కాకాపోరా ప్రాంతాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తరలింపులో పాలుపంచుకుంటున్నాడు."

- సీనియర్​ పోలీసు అధికారి

అరెస్ట్​ అయిన వ్యక్తి పాంపోర్​లోని జాఫ్రోన్​ కాలనీకి చెందిన హరిస్ షరీఫ్​ రాథర్​గా గుర్తించారు. అతని నుంచి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ చర్యల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ ఏడాది శ్రీనగర్​-జమ్ము రహదారిలో భద్రతా దళాలపై జరిగిన నాలుగు దాడుల్లో పాలుపంచుకున్న పాకిస్థానీ ఉగ్రవాది సైఫుల్లా సన్నిహితుల్లో ఆరుగురిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు పేర్కొన్న మరుసటి రోజునే ఈ అరెస్ట్​ చేపట్టడం మరో ముందడుగు. అరెస్టైన వారి నుంచి దాడులకు ఉపయోగించిన కార్లు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో పాక్​ ఆయుధాలు.. ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.