ETV Bharat / bharat

యోగా మహోత్సవ ప్రధాన వేదికగా ఈసారి 'లేహ్​' - modi yoga

అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన వేదికగా లద్దాఖ్​ రాజధాని లేహ్​ను ఎంపిక చేసింది ఆయుష్​శాఖ. జూన్​ 21న జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు.

Leh to host International Yoga Day's main event, PM Modi to attend
యోగా మహోత్సవ ప్రధాన వేదికగా ఈసారి 'లేహ్​'
author img

By

Published : Mar 12, 2020, 5:56 AM IST

ప్రపంచవ్యాప్తంగా జూన్​ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల కోసం భారత్​లో ప్రతి ఏటా ఓ ప్రధాన వేదికను నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఈసారి ఆ అవకాశం లద్దాఖ్​ రాజధాని లేహ్​ను వరించింది. ఈ విషయాన్ని ఆయుష్​ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు అధికారులు.

ఈ కార్యక్రమంలో మోదీ పలు యోగాసనాలు వేయనున్నారు. సుమారు 15 నుంచి 20 వేల మంది ఈ వేడుకల్లో పాల్గొంటారని అంచనా.

"ఐడీవై(ఇంటర్నేషనల్​ డే ఆఫ్​ యోగా)-2020 చాలా ప్రత్యేకమైనది, భిన్నమైనది. లేహ్ వంటి అత్యంత ఎత్తయిన ప్రాంతంలో.. ఈ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి."

-- శ్రీపాద్​ నాయక్, ఆయుష్​ మంత్రి

సీఐఐ, ఎఫ్​ఐసీసీ, ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ కంపెనీ సెక్రటరీ వంటి పరిశ్రమలు.. సీబీఎస్​ఈ, ఎన్​సీఈఆర్​టీ, యూజీసీ, డీఏవీ వంటి విద్యాసంస్థలు.. జూన్​ 21 కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలను సిద్ధం చేసే పనిలో పడ్డాయి.

Leh to host International Yoga Day's main event, PM Modi to attend
గతేడాది రాంచీలో ఆసనాలు వేస్తున్న మోదీ

గతేడాది..

2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను నిర్వహిస్తోంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఈ వేడుకలు గతేడాది ఝార్ఖండ్​లోని రాంచీలో జరిగాయి.

ఇదీ చదవండి: దేశంలో మరొకరికి కరోనా.. 62కు చేరిన బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.