అసోంలోని 27 జిల్లాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు. 2,763 గ్రామాలు వరద గుప్పిట్లో ఉన్నాయి. వందలాది ఇళ్లు నీటమునిగాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. 1,03,80,615 హెక్టార్ల పంట భూమి నీట మునిగినట్లు అధికారులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వరదల కారణంగా ఇప్పటి వరకు 50 మంది మృతి చెందినట్లు తెలిపారు.
![latest updates and visual of Assam flood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8018902_kdjf.jpg)
![latest updates and visual of Assam flood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8018902_djkf.jpg)
బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
![latest updates and visual of Assam flood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8018902_d.jpg)
వరదల్లో చిక్కుకున్న వారిని అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను అధికారులు అందజేస్తున్నారు.
![latest updates and visual of Assam flood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8018902_jd.jpg)
ఇదీ చూడండి:'వారాంతానికి 10లక్షలకుపైగా కరోనా కేసులు'