ETV Bharat / bharat

అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు..

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగాక భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. నెల రోజుల్లోనే ధరలు రెట్టింపు అయ్యాయి. నగర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు ఇతర కారణాల వల్ల భూములకు డిమాండ్ ఏర్పడింది.

Land prices rises in Ayodhya after Ram temple bhoomi Pujan
నెల రోజులకే అయోధ్యలో భూములకు రెక్కలు
author img

By

Published : Sep 21, 2020, 11:05 PM IST

అయోధ్యలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రామ మందిరం నిర్మాణం కోసం భూమి పూజ జరిగిన నెల రోజుల్లోపే ధరలు రెట్టింపయ్యాయి.

నిజానికి అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతే 30 నుంచి 40 శాతం ధరలు పెరిగాయి. దీంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భూముల ధరలు ఆకాశానికి చేరాయి.

అయోధ్యను భారతదేశ 'వాటికన్​ సిటీ'గా తీర్చిదిద్దుతామన్న యోగి ఆదిత్యనాథ్ హామీతో.. భూముల డిమాండ్ అమాంతం పెరిగింది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం, మూడు నక్షత్రాల హోటళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో భూముల ధరలు పెరిగిపోయాయి.

"అయోధ్యలో రామ మందిర భూమి పూజ నిర్వహించిన తర్వాత పెద్ద వ్యాపారులు ఇక్కడ హోటళ్లు, ధర్మశాలలు నిర్మించాలని అనుకుంటున్నారు. దీంతో స్థానిక డీలర్లను సంప్రదిస్తున్నారు. ఇలా డిమాండ్ భారీగా పెరుగుతోంది."

-రిషికేష్ ఉపాధ్యాయ్, అయోధ్య మేయర్

రామ జన్మభూమి మందిర కాంప్లెక్స్​కు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూముల ధర సుప్రీం తీర్పునకు ముందు ఒక చదరపు అడుగుకు రూ.1,500 నుంచి రూ.2,500 మధ్య ఉండేది. చారిత్రక తీర్పు తర్వాత వీటి ధర చదరపు అడుగుకు రూ.4,000-రూ6,000కు చేరింది. తీర్పునకు ముందు భూములు రూ.900కు లభించిన దాఖలాలూ ఉన్నాయి.

కొందరికి పెట్టుబడి అవకాశంగా...

దశాబ్దాలుగా నగరంలో నెలకొన్న వివాదాస్పద పరిస్థితుల వల్ల భూముల ధరలు తక్కువగా ఉండేవి. నగరానికి దగ్గరగా ఉన్న ఫైజాబాద్​లోనే హోటళ్లు ఉండేవి. చాలా మంది కొనుగోలుదారులు ధర్మశాలలు, కమ్యునిటీ వంటశాలల నిర్మాణం వంటి మతపరమైన ప్రయోజనాల కోసం భూములను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. పెట్టుబడి అవకాశాల కోసం మరికొందరు ఈ భూముల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.

ఇదీ చదవండి- అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.