ETV Bharat / bharat

నిలకడగా లాలూ ఆరోగ్యం.. ప్రైవేటు వార్డుకు మార్పు - లాలూ ప్రసాద్​ యాదవ్

కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​ ఆరోగ్యం కుదుటపడుతోంది. దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న లాలూను ఐసీయూ నుంచి ప్రైవేటు వార్డుకు మార్చారు వైద్యులు.

lalu prasad yadav, aiims
కుదుటపడుతున్న లాలూ ఆరోగ్యం
author img

By

Published : Jan 29, 2021, 10:24 AM IST

దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న బిహార్​ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​ కోలుకుంటున్నారు. ఐసీయూ నుంచి గురువారం ప్రైవేటు వార్డుకు మార్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. శ్వాసకోశ సమస్య కారణంగా ఈనెల 23న లాలూను హుటాహుటిన దిల్లీలోని ఎయిమ్స్​కు తరలించారు.

లాలూను మొదట ఝార్ఖండ్​ రాజధానిలోని రాజేంద్ర ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మెడికల్ సైన్స్​ (రిమ్స్)లో చేర్చారు. వైద్యుల సూచన మేరకు దిల్లీ ఎయిమ్స్​కి మార్చారు. లాలూ న్యూమోనియాతో బాధపడుతున్నారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారని రిమ్స్​ వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి : 'త్వరలోనే పదో విడత సైనిక చర్చలు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.