ETV Bharat / bharat

అక్కడి పోలీస్​ స్టేషన్లు, రైల్వేలో మహిళలకే పూర్తి బాధ్యతలు

పోలీస్​ స్టేషన్ల నిర్వహణ నుంచి రైల్వే కార్యకలాపాల వరకు పలు బాధ్యతలు స్వీకరించి కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి కేరళ మహిళలు సన్నద్ధమవుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్​ స్టేషన్లలో బాధ్యతలను మహిళా అధికారిణులు నిర్వర్తించనున్నారు. అలాగే తొలిసారి మహిళలే పూర్తిగా రైళ్లను నడుపుతారని కేరళ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.కె. శైలజ స్పష్టం చేశారు.

Lady officers to take charge of police stations, train ops on Women's Day in Kerala
పోలీస్​ స్టేషన్లు, రైల్వేలో మహళలకే పూర్తి బాధ్యతలు
author img

By

Published : Mar 7, 2020, 3:00 PM IST

Updated : Mar 7, 2020, 3:09 PM IST

పోలీస్​ స్టేషన్ల నిర్వహణ నుంచి రైల్వే కార్యకలాపాల వరకు పలు బాధ్యతలు స్వీకరించి కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి కేరళ మహిళలు సన్నద్ధమవుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారతకు సిసలైన ఉదాహరణగా నిలవాలని తపిస్తున్నారు.

మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు స్టేషన్ల బాధ్యతలను మహిళా అధికారిణులకు అప్పగించాలని కేరళ డీజీపీ లోక్​నాథ్ బెహ్రా అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

"మహిళా దినోత్సవం రోజున పోలీసు స్టేషన్లను మహిళా ఎస్​హెచ్​ఓలు నిర్వహిస్తారు. మహిళా అధికారిణిలు లేని స్టేషన్లలో.. సీనియర్ సివిల్ పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తారు. వీరు ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులపై స్వయంగా దర్యాప్తు చేస్తారు."- లోక్​నాథ్ బెహ్రా, కేరళ డీజీపీ

సీఎం ఎస్కార్ట్స్​గా'

మార్చి 8న కేరళ ముఖ్యమంత్రి వాహన ఎస్కార్టులో మహిళా కమాండోలు విధులు నిర్వహిస్తారు. అలాగే ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన క్లిఫ్ హౌస్​ వద్ద మహిళా కమాండోలు, సీఎం కార్యాలయం ఉన్న నార్త్​ బ్లాక్​లో మహిళా పోలీసు గార్డులు విధులు నిర్వహించనున్నారు.

రైలు బండినీ నడిపేస్తారు...

మహిళా దినోత్సవం సందర్భంగా తొలిసారి మహిళలే పూర్తిగా రైళ్లను నడుపుతారని కేరళ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.కె. శైలజ స్పష్టం చేశారు. ఇది రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని ఆమె అన్నారు.

"మార్చి 8న ఉదయం 10.15 గంటలకు ఎర్నాకుళం నుంచి వెనాడ్ వెళ్లే ఎక్స్​ప్రెస్​ను పూర్తిగా మహిళలే నడుపుతారు. లోకో పైలెట్​, అసిస్టెంట్ లోకో పైలెట్​, పాయింట్స్ మెన్, గేట్ కీపర్, ట్రాక్ వుమన్ ఇలా అందరూ మహిళే ఉంటారు. టికెట్ బుకింగ్ కార్యాలయం, సమాచార కేంద్రం, సిగ్నల్, క్యారేజ్​, వ్యాగన్​లను కూడా మహిళలే నిర్వహిస్తారు. మహిళా అధికారులు రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్​గా బాధ్యతలు నిర్వహిస్తారు."- కె.కె. శైలజ, కేరళ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి

తిరువనంతపురం నుంచి ఎర్నాకుళంలోని షోర్నూర్​ వరకు వెళ్లే వెనాడ్ ఎక్స్​ప్రెస్ బాధ్యతలు కూడా మహిళలు స్వీకరిస్తారని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి: దేవుడిని ఎత్తుకునేందుకు గజరాజుల పరుగుపందెం!

Last Updated : Mar 7, 2020, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.