ETV Bharat / bharat

మొదట వైదొలగాల్సింది మీరే: భారత్​

author img

By

Published : Oct 13, 2020, 5:14 AM IST

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు సోమవారం 7వ విడత కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చలు సుదీర్ఘంగా సాగాయి. చైనా తన బలగాలను పూర్తిస్థాయిలో ఉపసంహరించి, ఏప్రిల్​ నాటి యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందేనని భారత్​ గట్టిగా స్పష్టం చేసినట్లు అధికార వర్గాల సమాచారం.

military level talks
కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చలు

తూర్పు లద్దాఖ్​లో ఘర్షణనలను తగ్గించేందుకు సోమవారం 7వ విడత కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చలు సుదీర్ఘంగా సాగాయి. చర్చల సందర్భంగా.. అన్ని కీలక ఘర్షణ ప్రాంతాల నుంచి చైనా తన సైనిక బలగాలను సత్వరం, పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోవటం సహా ఏప్రిల్​లోని యథాతథ స్థితిని పునరుద్ధరించాలని భారత్ గట్టిగా స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సరిహద్దుల నుంచి మొదట వైదొలగాల్సింది మీరేనని చైనా వద్ద భారత్​ కుండబద్దలు కొట్టిందని పేర్కొన్నాయి.

కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చలు తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న చుషుల్​ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా ఈ చర్చలు కొనసాగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్​ తరఫున కార్ప్స్​ కమాండర్​ లెప్టినెంట్​ జనరల్​ హరిందర్​ సింగ్​ నేతృత్వం వహించారు.

భారత్​-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన మొదలై ఆరు మాసాలు కావస్తోంది. సరిహద్దుల్లో ఇరుదేశాలకు చెందిన సుమారు లక్షకుపైగా బలగాల మోహరింపుతో.. గత చర్చల్లోని తీర్మానాలు మసకబారుతున్నాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగేలా కనిపిస్తోంది.

సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సైనిక చర్చలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, అన్ని ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు రోడ్​మ్యాప్​ ఖరారు చేయటమే ఈ భేటీ అంజెండాగా అధికారవర్గాల సమాచారం.

ఇదీ చూడండి: 10 లక్షల ఉద్యోగాల హామీపై ముఖ్యమంత్రి ఎగతాళి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.