లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటకలో కాంగ్రెస్-జేడీ(ఎస్) కూటమి ప్రభుత్వం కుప్పకూలుతుందని కేంద్రమంత్రి, భాజపా నేత సదానందగౌడ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం (మే 24) ఉదయం వరకు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఎద్దేవా చేశారు.
"కుమారస్వామి రేపు సాయంత్రం వరకు మాత్రమే కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఈ రోజు రాత్రి అతను సరిగా నిద్రపోలేరు కనుక రేపు లేదా ఆ మరుసటి రోజు మాత్రమే ఆయన పదవిలో ఉంటారు. కచ్చితంగా శుక్రవారం ఆయన పదవి నుంచి దిగిపోతారు."
-సదానందగౌడ, కేంద్రమంత్రి, భాజపా నేత
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతోందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ తెలిపారు. 28 లోక్‌సభ స్థానాల్లో భాజపా 21 నెగ్గుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో సంకీర్ణ కూటమికి ప్రతికూల ఫలితం వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. ఇదే జరిగితే సంకీర్ణ ప్రభుత్వ స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. 'ఆపరేషన్ కమల్' పేరుతో తమలోని అసంతృప్త నేతలను భాజపా ఆకర్షిస్తోందని కాంగ్రెస్-జేడీ(ఎస్) కూటమి ఆందోళన చెందుతోంది.
స్వపక్షంలోనే విపక్షం!
ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను తోసిపుచ్చిన కాంగ్రెస్-జేడీ(ఎస్) నేతలు ఈవీఎంలు తారుమారు చేశారని ఆరోపించారు. దీనిపై అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యే కె. సుధాకర్ తీవ్రంగా స్పందించారు. స్వపక్షంపైనే విమర్శలు చేశారు.
-
Personally I am confused why the issue of EVM manipulation is being brought into conversation while talking about the exit poll results. When in fact the exit poll results indicate the feeling of the voter at the conclusion of polling. pic.twitter.com/OwuWkAnD5M
— Dr Sudhakar K (@mla_sudhakar) May 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Personally I am confused why the issue of EVM manipulation is being brought into conversation while talking about the exit poll results. When in fact the exit poll results indicate the feeling of the voter at the conclusion of polling. pic.twitter.com/OwuWkAnD5M
— Dr Sudhakar K (@mla_sudhakar) May 21, 2019Personally I am confused why the issue of EVM manipulation is being brought into conversation while talking about the exit poll results. When in fact the exit poll results indicate the feeling of the voter at the conclusion of polling. pic.twitter.com/OwuWkAnD5M
— Dr Sudhakar K (@mla_sudhakar) May 21, 2019
"వ్యక్తిగతంగా నేను అయోమయంలో ఉన్నాను. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు విడుదలయిన సమయంలోనే ఎందుకు ఈవీఎంల తారుమారు విషయం (రాజకీయ పార్టీలు) మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఓటర్ల నాడిని తెలుపుతాయి."
-సుధాకర్, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఇదీ చూడండి: నలుగురు సుప్రీం జడ్జిల నియామకానికి కేంద్రం పచ్చజెండా