రాజకీయల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిన కొద్ది రోజుల అనంతరం కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.
నిజానికి తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని.. రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. తన పదవీకాలంలో ప్రజలకు వీలైనంత మంచి చేశానని చెప్పారు.
దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. విద్వేషపూరిత రాజకీయాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తక్కువ సీట్లే గెలిచినా.. కాంగ్రెస్ పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అసంతృప్త ఎమ్మెల్యేల కారణంగా 14 నెలల తర్వాత సంకీర్ణ ప్రభుత్వంలో అనిశ్చితి నెలకొంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య జులై 23న విశ్వాస పరిక్షలో ఓడి.. అధికారాన్ని కోల్పోయింది కుమార స్వామి ప్రభుత్వం.
అనంతరం జులై 26న ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన భాజపా నేత యడియూరప్ప... అదే నెల 29న విశ్వాస పరీక్షలో గెలుపొంది రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించారు.
ఇదీ చూడండి: 'ఆపరేషన్ కశ్మీర్'పై నిఘా వర్గాల సమాచారం ఇదే!