ETV Bharat / bharat

'వ్యవసాయ భూమి'నే దీవిగా మార్చిన ఘనత ఆమెది!

కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టి, నష్టాలు చవిచూసిన వారికి.. వినూత్న ఆలోచనతో దూసుకెళ్తోన్న ఓ మహిళ విజయగాథ ఆదర్శప్రాయమవుతోంది. 68 ఏళ్ల వయసులోనూ ఆమె వ్యాపారం చేస్తూ ఏడాదికి రూ.25 లక్షల వరకు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆ మహిళ ఏం చేసింది? ఆమె వ్యాపారంలో విజయానికి కారణాలేంటో తెలుసుకునేందుకు.. ఓ ప్రత్యేక కథనం మీకోసం.

Kiran Rajputh is an inspirational women
'వ్యవసాయ భూమి'నే దీవిగా మార్చిన ఘనత ఆమెది!
author img

By

Published : Dec 20, 2020, 8:59 AM IST

Updated : Dec 20, 2020, 11:35 AM IST

కిరణ్​ సృష్టించిన దీవి

మీకేమైనా కొత్త వ్యాపారం చేసే ఆలోచన ఉందా..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఎవరైనా కాస్త తడబడతారు. సూటూ, బూటూ వేసుకుని, బాగా చదువుకున్న సంపన్నులే వ్యాపారాలు చేయగలుగుతారన్న అపోహ చాలామంది సామాన్యుల్లో ఉంటుంది. ఈ అభిప్రాయం నిజం కాదని నిరూపిస్తోంది 68 ఏళ్ల మహిళ. 10వ తరగతితోనే చదువు మానేసిన ఉత్తర్​ప్రదేశ్​ కన్నౌజ్ గుందాకు చెందిన వ్యాపారి కిరణ్ రాజ్‌పూత్.. ప్రస్తుతం ఏడాదికి 25 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ఇతరులకు కూడా శిక్షణనిస్తోంది. కిరణ్ రాజ్‌పూత్ విజయాన్ని దిగ్గజ సంస్థ గూగుల్​ సైతం ప్రశంసించింది.

రాజ్‌పూత్ ప్రత్యేకత తెలియాలంటే ఓ దీవిని చూడాల్సిందే. అయితే.. అది సహజంగా ఏర్పడిన దీవి అనుకుంటే మాత్రం పొరబాటే. తనకున్న 25 బిగాల వ్యవసాయ భూమినే దీవిగా మార్చేసిందా మహిళ. ప్రస్తుతం ఆ ప్రాంతం పర్యటక ప్రదేశంగా కళకళలాడుతోంది. బోటింగ్ చేసేందుకు యువత ఇక్కడికి తరలివస్తారు. ఇక్కడ పెరిగే చేపలు, పండ్లు కిరణ్‌కు అదనపు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి.

"2016లో ఓ ప్రభుత్వ పథకం అమల్లోకి వచ్చింది. ఇది ప్రారంభించేందుకు మాకు రుణం దొరికింది. ఎలా చేశావని ఇప్పుడు నన్నందరూ అడుగుతుంటారు. మొదట్లో నేనూ చాలా కష్టాలే పడ్డాను. డబ్బు సమకూర్చుకుని, చేపల చెరువుపై పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు అదే పెద్ద వ్యాపారంగా మారింది. ఈ వ్యాపారం గురించి ఔత్సాహికులకు కూడా నేర్పించాం".

-కిరణ్ రాజ్‌పూత్.

"మా అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా నీరే కనిపించేదట. ఇలా నీరు నిల్వ ఉండడం వల్ల వ్యవసాయం కష్టంగా మారేది. చాలా నష్టపోయేవాళ్లం. ఆ తర్వాతే చేపల పెంపకం చేపట్టాలని మా అమ్మ నిర్ణయించుకున్నారు".

-శైలేందర్, కిరణ్ కుమారుడు.

ఓ కొత్త వ్యాపార ఆలోచనను ఆచరణలో పెట్టడం అంత సులువైన పనికాదు. ప్రభుత్వం నుంచి రుణంగా కిరణ్‌కు రెండు లక్షల రూపాయలే లభించాయి. మిగతా డబ్బంతా ఇంటి నుంచీ, బంధువుల నుంచీ సేకరించి, చేపల చెరువుపై 11 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టింది.

"20 నుంచి 50 మంది ఇక్కడికి ప్రతిరోజూ వస్తారు. వాళ్లందరికీ భోజనం పెడతాం. ఇక్కడ తిరుగుతారు, ఆడుకుంటారు, మా తోటలో పండే తాజా పళ్లు తిని ఆహ్లాదంగా గడుపుతారు".

-శైలేందర్, కిరణ్ కుమారుడు.

ఓ చెరువుని తవ్వి, మామిడి, జామ, అరటి, బొప్పాయి చెట్లను ఆ దీవిలో నాటారు. పూల చెట్లు కూడా పెంచుతున్నారు. చెరువులో అన్ని రకాల చేపల పెంపకం చేపట్టారు. నాలుగేళ్ల తర్వాత వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోంది.

"చేపల చెరువుల వల్ల 5 నుంచి 7 లక్షల రూపాయల లాభం వస్తోంది. 20 నుంచి 25 లక్షల రూపాయల వ్యాపారం జరుగుతోంది. చాలామంది ఉపాధి పొందుతున్నారు".

-శైలేందర్, కిరణ్ కుమారుడు.

ఈ ప్రాంతంలోని ఇతర రైతులకు కిరణ్ చేస్తున్న వ్యాపారం ఆదర్శంగా నిలుస్తోంది. కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టి, నష్టాలు చవిచూసిన వారికి.. వినూత్న ఆలోచనతో విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తగా ఎదిగిన కిరణ్ గాథ ఆదర్శనీయం.

ఇదీ చదవండి:బంగారానికి రెక్కలొచ్చాయ్​- 'సీబీఐ' కాకమ్మ కథలు!

Last Updated : Dec 20, 2020, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.