ETV Bharat / bharat

'గోల్డ్​ స్మగ్లింగ్​ కేసు కీలక​ పత్రాలను ధ్వంసం చేశారు' - kerala latest news

కేరళ సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. బంగారం కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలను ధ్వంసం చేసేందుకు ప్రభుత్వమే ఈ కుట్ర చేసిందని ప్రతిపక్ష కాంగ్రెస్​ ఆరోపించింది. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

Kerala secretariat fire: Opposition alleges important files destroyed
'బంగారం కుంభకోణ పత్రాలను ధ్వంసం చేశారు'
author img

By

Published : Aug 26, 2020, 11:38 AM IST

కేరళ సచివాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాద ఘటన అనంతరం హైడ్రామా చోటుచేసుకుంది. బంగారం కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలను ధ్వంసం చేసేందుకు సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఘటనపై ఎన్​ఐఏ బృందంతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది.

అయితే కాంగ్రెస్, భాజపాలు కుట్రపన్నే ఇలా చేస్తున్నాయని కేరళ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తునకు నిపుణుల ప్యానెల్​ను ఏర్పాటు చేసింది. వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నిపుణుల బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది.

చెలరేగిన మంటలు..

కేరళ సచివాలయం నార్త్ బ్లాక్​ ప్రోటోకాల్ విభాగం ​ రెండో అంతస్తులో మంగళవారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. భవనం నుంచి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వీటిని అదుపు చేశారు. గదిలో పలు పత్రాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.

ఘటన జరిగిన అనంతరం భాజపా కార్యకర్తలతో కలిసి సచివాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుందరన్. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అగ్ని ప్రమాద ఘటనను నిరసిస్తూ కోజికోడ్​లో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం వైపు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు.

  • #WATCH Kerala: Police baton-charged on workers of Youth Congress, protesting in Kozhikode against incident of fire at the Secretariat in Thiruvananthapuram. They were marching towards office of Kozhikode Police Chief when Police stopped them. Injured shifted to hospital. (25.08) pic.twitter.com/6uE1HcmQuh

    — ANI (@ANI) August 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.