ETV Bharat / bharat

పనసపండు గాయాలకు కరోనా చికిత్స.. అసలేం జరిగింది! - Kerala man hospitalised after jackfruit falls corona infection

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎవరి నుంచి ఎవరికి సోకుతోందో తెలియని పరిస్థితి. కేరళలో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. పనసపండు తలపై పడి గాయాలతో ఆసుపత్రికి వెళ్లిన ఓ ఆటో డ్రైవర్​కు.. కొవిడ్​ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. అసలేం జరిగింది?

Kerala man hospitalised after jackfruit falls on him, tests COVID-19 positive
పసనపండుతో గాయమైందని వెళ్తే.. కరోనా సోకిందన్నారు!
author img

By

Published : May 25, 2020, 4:34 PM IST

కేరళలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. పనసపండు తల మీద పడి గాయాలపాలయ్యాడు ఓ ఆటో డ్రైవర్​. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా.. అతడికి కరోనా సోకినట్టు వైద్యులు తెలిపారు. ఆ విషయం తెలుసుకున్న అతడు షాక్​కు గురయ్యాడు.

జరిగిందేమిటంటే..?

కన్నూరులోని పరియారం వైద్య కళాశాల అధికారుల కథనం ప్రకారం.. కాసరగోడ్‌ జిల్లాలోని బేలూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్​ పనసపండును తెంపబోయాడు. వాటిలో ఒకటి అతని తలపై పడటం వల్ల గాయపడ్డాడు. కాళ్లు, చేతులకు కూడా బాగా దెబ్బలు తగిలాయి. ఆ వ్యక్తికి శస్త్రచికిత్స జరపాలని వైద్యులు నిర్ణయించారు. ప్రస్తుత వైద్య నిబంధనల ప్రకారం, ఇతర పరీక్షలతో పాటు ఆ వ్యక్తికి కరోనా వైరస్‌ నిర్ధరణ పరీక్షలనూ చేశారు. వెలువడ్డ ఫలితాల్లో అతనికి కరోనా ఉన్నట్టు తేలింది.

వైరస్​ ఎలా సోకింది?

ఆటో డ్రైవర్‌ గతంలో విదేశాలకు వెళ్లిన సందర్భాలు లేవు. ఆయన సంబంధీకుల్లో ఎవరికీ ఇప్పటి వరకు కరోనా సోకలేదు. ఆటోలో ప్రయాణించిన వారి నుంచే ఈ మమ్మారి సోకి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. లేదా గతంలో జిల్లా ఆస్పత్రికి వెళ్లటం వల్ల అక్కడ ఈ మహ్మారి బారిన పడి ఉంటాడని భావిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు.

ఇదీ చూడండి: క్వారంటైన్ సెంటర్​ సాక్షిగా 'కాజల్- ఓంప్రకాశ్​'ల కల్యాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.