ETV Bharat / bharat

మాస్కుల కొరత తీర్చేందుకు కేరళ ముందడుగు

కరోనా భయంతో మాస్క్​ల వాడకం పెరిగింది. డిమాండ్​ విపరీతంగా ఉండటం వల్ల మార్కెట్లోకి వచ్చిన మాస్క్​లు క్షణాల్లో మాయమవుతున్నాయి. పక్కదేశాల నుంచి దిగుమతి చేసుకుందామంటే.. అక్కడా అదే పరిస్థితి. ఈ క్రమంలో మాస్క్​ల​ కొరతను అధిగమించేందుకు చక్కటి ఆలోచన చేశారు కేరళ వాసులు. అదేంటో చూద్దాం.

kerala-kannur-womens-group
మాస్కుల లోటు తీర్చేందుకు కేరళ ముందడుగు
author img

By

Published : Mar 14, 2020, 4:13 PM IST

Updated : Mar 14, 2020, 6:24 PM IST

మాస్కుల లోటు తీర్చేందుకు కేరళ ముందడుగు

కరోనా దెబ్బకి దేశంలో ఎన్​-95 మాస్క్​లే కాదు.. సాధారణ సర్జికల్ మాస్క్​లకూ కొరత ఏర్పడింది. కేరళలో మాస్క్​ల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు విభిన్నరీతిలో సాయపడుతున్నారు అక్కడి ప్రజలు. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ సేవాసంస్థ వారు అమెరికా నుంచి ఫ్యాబ్రిక్​ను తెప్పించి మాస్క్​లు ఉత్పత్తి చేసి, ఉచితంగా పంచుతున్నారు. కన్నూరు జిల్లాకు చెందిన మహిళలేమో వస్త్త్రాలతోనే ముఖాలకు ముసుగులు కుట్టేస్తున్నారు.

నేత వస్త్రాలతోనే ముసుగులు

కన్నూరు జిల్లా, తాలిపరంబుకు చెందిన 'కుడుంబశ్రీ' స్వయం సహాయక సంఘం సభ్యులు వస్త్ర బ్యాగులు తయారు చేస్తారు. రాష్ట్రంలో మాస్క్​ల కొరత ఏర్పడడం వారిని తీవ్రంగా కలచివేసింది. మాస్క్​లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోలేకపోతున్నామని గ్రహించిన మహిళలు.. నేత వస్త్రాలతోనే ముఖాలకు ముసుగులు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. పరియరమ్ గ్రామస్థుల ప్రోత్సాహంతో వస్త్ర మాస్క్​లు తయారు చేసి సరసమైన ధరలకే విక్రయిస్తున్నారు.

అందుకే ఉచితం..

కేవలం దగ్గు, జలుబు, తుమ్ముతో బాధపడేవారిలోని వైరస్​ గాల్లో కలవకుండా ఉండేందుకు మాత్రమే మాస్క్​లు వాడాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. అనవసర భయాలకు పోయి ప్రతి ఒక్కరు మాస్క్​లను తెగవాడేస్తున్నారు. దీంతో మాస్క్​లకు డిమాండ్​ పెరిగి ధర అంబరాన్నంటింది. మరి పేద ప్రజలు అంత ఖరీదైన మాస్క్​లు ధరించలేరు కదా.. అందుకే ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్నారు కేరళ లాటిన్​ క్యాత్లెక్​ అసోసియేషన్​ సభ్యులు.

కురకప్పల్లి పాస్టర్​ సెబాస్టియన్​ ఆలోచనతో వివిధ రంగాలకు చెందిన 25 మంది స్వచ్ఛందంగా మాస్క్​ల తయారీకి ముందుకొచ్చారు. అమెరికా నుంచి ముడిసరుకును తెప్పించి కలూర్​ యూనిట్​, పట్టకుజి చర్చ్​లలో కుట్టు మిషన్లపై మాస్క్​లు కుడుతున్నారు. రోజుకు 8 గంటలు శ్రమించి సుమారు 500 మాస్క్​లను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖకు పంపిస్తున్నారు.

ఇదీ చదవండి:రూపాయికే నోరూరించే బిర్యానీ.. ఎగబడ్డ జనం!

Last Updated : Mar 14, 2020, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.