ETV Bharat / bharat

ఆరోగ్య భారతం: కేరళ టాప్​- ఏపీ నెం.2​ - ఆరోగ్య సూచీ

ఆరోగ్య ప్రమాణాల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది కేరళ. ఆంధ్రప్రదేశ్​ 2వ స్థానం దక్కించుకుంది. వేర్వేరు రాష్ట్రాల్లో పరిస్థితుల్ని అధ్యయనం చేసి, ఈ ర్యాంకులు కేటాయించింది నీతి ఆయోగ్.

ఆరోగ్య భారతం: కేరళ టాప్​- ఏపీ నెం.2​
author img

By

Published : Jun 25, 2019, 4:39 PM IST

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వరుసగా రెండో ఏడాది​ 'ఆరోగ్య సూచీ' ర్యాంకులు కేటాయించింది నీతి ఆయోగ్​. ఆరోగ్య ప్రమాణాలపై ఆయా రాష్ట్రాల్లో దీర్ఘకాల అధ్యయనం అనంతరం ఈ జాబితాను రూపొందించింది. కేరళ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆరోగ్య ప్రమాణాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్​ది చిట్టచివరి స్థానం.

'ఆరోగ్య రాష్ట్రాలు- ప్రగతిశీల భారతదేశం' నివేదికను 2015-16 నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు 23 ఆరోగ్య సూచికల ఆధారంగా రూపొందించారు. హరియాణా, రాజస్థాన్​, ఝార్ఖండ్​ రాష్ట్రాల్లో ఆరోగ్య ప్రమాణాలు అభివృద్ధి చెందుతున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది.

గతేడాది ఫిబ్రవరిలో మొదటి ఆరోగ్య సూచీ(2014-15)ని విడుదల చేసింది నీతి ఆయోగ్​.

ఇదీ చూడండి : ఇక బాదుడే: గీత దాటితే లక్ష వరకు జరిమానా!

Intro:Body:

uu

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.