ETV Bharat / bharat

118ఏళ్ల బామ్మకు శస్త్రచికిత్స​ - చరిత్ర

పంజాబ్​ లూథియానాలో వైద్యులు అద్భుతం చేశారు. 118 ఏళ్ల వృద్ధురాలికి గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేసి చరిత్ర సృష్టించారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడినట్టు నిర్ధరించారు.

కర్తార్​ కౌర్​ సంఘా
author img

By

Published : Mar 7, 2019, 3:31 PM IST

Updated : Mar 7, 2019, 7:15 PM IST

ఈమె కర్తార్​ కౌర్​ సంఘా. వయసు 118 ఏళ్లు. 5 తరాలు చూశారు. ఇంతకుముందెప్పుడూ వ్యాధుల బారిన పడలేదు. ఇటీవల గుండె ప్రతిస్పందన సరిలేక ఆస్పత్రికి తీసుకొచ్చారు కుటుంబసభ్యులు. ఈ వయసులో కర్తార్​కు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. హృదయ స్పందనలను నియంత్రించే పేస్​మేకర్​ అమర్చి, ఆమె ప్రాణాలు కాపాడారు. పంజాబ్​ లూథియానాలో జరిగిందీ అద్భుతం.

118ఏళ్ల బామ్మకు శస్త్రచికిత్స​కు విజయవంతం

"మా అమ్మకు 118 ఏళ్లు. ఇప్పటివరకు పెద్ద వ్యాధులేమీ రాలేదు. ఆసుపత్రికే రాలేదు. నాకు 90 ఏళ్లు. ఉపాధ్యాయురాలిగా పదవీ విరమణ పొందాను." -- జిబ్రిజిందర్​ కౌర్​, కర్తార్​ కుమార్తె

" ఆమె మా కుటుంబంలో 5 తరాలు చూశారు. ఆమె మాకు చాలా విలువైన మనిషి. అందుకే ఏ రికార్డుల కోసం ఇంతవరకూ ప్రయత్నించలేదు. మాకు అది అవసరం లేదనిపించింది. ఆమెకు మొదటిసారి అనారోగ్యం వచ్చింది. వైద్యులు గుండెలో పేస్​మేకర్​ అమర్చారు. మాకు చాలా గర్వంగా ఉంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె గుండె నిమిషానికి 20 సార్లే కొట్టుకునేది. పేస్​మేకర్​ అమర్చిన 2 రోజుల తర్వాత సాధారణ స్థితికి వచ్చింది. ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. " -- సిమ్రన్​ జీత్​ సింగ్​ సంఘా,కర్తార్​ ముని మనవడు

గిన్నిస్​ రికార్డు కోసం దరఖాస్తు చేసినట్టు తెలిపారు కర్తార్​కు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు.

"118 ఏళ్ల వృద్ధురాలికి ఈ ఆపరేషన్​ చేయడం మాకు పెద్ద సవాల్​ అనుకున్నాం. ఆమె కుటుంబం మాకు మద్దతిచ్చింది. ఆపరేషన్​ చేయకుంటే ఆమెను కొద్ది గంటల్లో కోల్పోవాల్సి వస్తుందని బాధపడ్డారు. శస్త్రచికిత్స తర్వాత అమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అందరినీ గుర్తుపడుతున్నారు. గత రికార్డు 107 సంవత్సరాలకు ఉంది. మేము ఆ రికార్డును దాటామని విశ్వాసంగా ఉన్నాం. గిన్నిస్​ రికార్డు, లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డుకు దరఖాస్తు చేశాం." - రవీందర్​ సింగ్​, వైద్యుడు

Intro:Body:

a

Conclusion:
Last Updated : Mar 7, 2019, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.