దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేరళలో తాజాగా 8,764మంది కరోనా బారినపడ్డారు. మరో 21మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 7,723మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
మహారాష్ట్రలో కొత్తగా 8,522 కేసులు నమోదవగా మొత్తం బాధితుల సంఖ్య 15 లక్షల 43వేలు దాటింది. మరో 187మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఒక్కరోజే 15,356మంది మహమ్మారిని జయించారు.
- కర్ణాటకలో రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. కొత్తగా 8,191మందికి వైరస్ సోకింది. మరో 87మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా అక్కడ మొత్తం బాధితుల సంఖ్య 7,26,106కు పెరిగింది.
- తమిళనాడులో ఒక్కరోజే 4,666 మందికి కరోనా సోకింది. మరో 57మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,65,930కు పెరిగింది.
- బంగాల్లో కొత్తగా నమోదైన 3,631 కేసులతో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 3 లక్షలు దాటింది. తాజాగా 62 మంది కొవిడ్ ధాటికి మరణించారు.
- దిల్లీలో తాజాగా 3,306 మందికి పాజిటివ్‌గా తేలింది. 45మంది మృతిచెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 14 వేల 224కు చేరింది.
- రాజస్థాన్‌లో ఒక్కరోజే 2,035 మంది కొవిడ్ బారినపడ్డారు. 14 మంది మరణించారు. దీంతో అక్కడ మొత్తం బాధితుల సంఖ్య లక్షా 63 వేలు దాటింది.
ఇదీ చూడండి: టీకా లభ్యత, పంపిణీ వ్యూహాలపై కేంద్ర మంత్రుల భేటీ