కర్ణాటక అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. తమ రాజీనామాల ఆమోదంపై స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వ్యాజ్యం దాఖలు చేశారు అసమ్మతి ఎమ్మెల్యేలు. 9 మంది రాజీనామాలు సరిగా లేవని, వ్యక్తిగతంగా కలవాలని స్పీకర్ రమేశ్‌కుమార్ ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు న్యాయపోరాటం దిగారు రెబల్స్. స్పీకర్ ప్రజాస్వామ్య బాధ్యతల్ని విస్మరిస్తున్నారని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట అసమ్మతి ఎమ్మెల్యేల తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి హాజరయ్యారు.
ఈ వ్యవహారంపై విచారణ చేపట్టే అవకాశాలను గురువారం పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.
ఇదీ చూడండి: 'ఆ రాజీనామాలను ఎందుకు ఆమోదించలేదు?'