దేశవ్యాప్తంగా కార్తీకపౌర్ణమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. నదుల్లో తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి.. ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, యువతులు భారీగా ఆలయాలకు బారులు తీరారు.
అయోధ్యలో సరయూ నది ఒడ్డున గల రామ్ కీ పైడీ ప్రాంతంలో 51,000 దీపాలను భక్తులు వెలిగించారు.
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవస్థానం సరికొత్త శోభను సంతరించుకుంది. ఆలయం ప్రాంగణంలో భక్తులు దీపాలను వెలిగించారు.
రాయ్‌పుర్‌లోని మహాదేవ్ ఘాట్‌లో ఛత్తీస్‌గఢ్ మఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ పుణ్యస్నానాలు చేశారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయంలో 'చొక్కపనాయ్' ఉత్సవాలను నిర్వహించారు.
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద భక్తలు ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
ఇదీ చూడండి:నేడు ప్రధాని మోదీ వారణాసి పర్యటన