ETV Bharat / bharat

ఆ చెత్తకుండీలో రూ. 2వేల నోట్లు.. చివరికి! - Currency notes found in UP garbage dump

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లోని ఓ చెత్తకుండీలో కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. రోడ్డు పక్కనే ఉన్న చెత్తకుండీలో భారీస్థాయిలో నగదు బయటపడింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికి అవి మాయమైపోయాయి. స్థానికులు, చెత్త ఏరుకునే వారు ఆ నోట్లను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

Kanpur: Rs 500 and Rs 2,000 Rupee notes found in garbage dump
చెత్తకుండీలో భారీగా బయటపడ్డ రూ.2000, 500 నోట్లు
author img

By

Published : Oct 19, 2020, 1:03 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లోని ఓ చెత్తకుండీలో భారీగా కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. విజయ్​ నగర్​లో ఉన్న ఈ చెత్తకుండీలో రూ.2000, రూ.500 నోట్లు కనిపించాయి. అయితే పోలీసులు ఘటనాస్థలానికి చేరే సరికి అవి మాయం అయ్యాయి.

కొద్దిసేపటికే ఉఫ్​...

ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చెత్త ఏరుకునే వారు ఈ నోట్లను చూసి.. స్థానికులకు సమాచారమిచ్చారు. కొద్దిసేపటికే అందరూ కలిసి ఆ నోట్లను తీసుకెళ్లిపోయారు. కొంతమంది రూ. 10వేలు విలువ చేసే నోట్లను పట్టుకెళ్లినట్టు తెలుస్తోంది. చివరికి పోలీసులు ఘటనాస్థలానికి చేరేసరికి వారికి నోట్లు కనిపించలేదు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు అధికారులు.

ఇదీ చదవండి: యూపీ, పంజాబ్​లో తెరుచుకున్న పాఠశాలలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.