ETV Bharat / bharat

'ఉగ్రకుట్రకు సహకరిస్తారా.. కఠినశిక్ష అనుభవించండి' - kerala

దేశంలో ఉగ్రదాడులకు ప్రయత్నిస్తూ కేరళలో పట్టుబడిన వ్యక్తులకు ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు మన్సీద్​ మహమూద్​ 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇలాంటి కేసుల్లో శిక్ష విధించడానికి సానుభూతి ప్రదర్శించే అవకాశమే లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Kanakamala IS terror module case: Prime accused gets 14-yr RI
'కేరళలో ఉగ్రకుట్రకు సహకరిస్తారా..? కఠినశిక్ష అనుభవించండి'
author img

By

Published : Nov 27, 2019, 9:25 PM IST

Updated : Nov 28, 2019, 12:01 AM IST

కేరళ సహా దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్రయత్నిస్తున్నారన్న అభియోగాలతో అరెస్టయిన వ్యక్తికి... జాతీయ దర్యాప్తు బృందం(ఎన్​ఐఏ) ప్రత్యేక కోర్టు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఉగ్ర సంస్థలతో సంబంధాలు కలిగి ఉండి వారి ప్రోద్భలంతో దాడులకు ప్రయత్నించారన్న కారణంగా ఎన్​ఐఏ అదుపులోకి తీసుకున్న ఆరుగురు వ్యక్తులకు సైతం శిక్ష విధించింది న్యాయస్థానం.

ప్రధాన నిందితుడైన మన్సీద్ మహమూద్​ సహా ఐదుగురిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం ప్రకారం ఐపీసీ సెక్షన్ల కింద కేసుల నమోదయ్యాయి. మన్సీద్​కు 14 ఏళ్లు, రెండో ప్రధాన నిందితుడు స్వాలీహ్ మహ్మద్​కు 10 ఏళ్లు, మూడో నిందితుడైన రషీద్ అలీకి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇలాంటి కేసుల్లో సానుభూతి ప్రదర్శించే అవకాశమే లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

"ఈ కేసులో నిందితులందరూ ఐఎస్ఐఎస్​ ఉగ్రముఠాకు సహకరించడానికి ప్రయత్నించారు. తమ ప్రణాళికలో భాగమయ్యేలా ఇతరులను ప్రోత్సహించినట్లు నిందితుల టెలిగ్రామ్ గ్రూప్ సంభాషణ ద్వారా తెలిసింది. సమగ్ర ప్రణాళిక వివరాలను మాత్రం అందరు సభ్యులతో పంచుకోలేదు. తమ క్రూరమైన ప్రణాళికలను అమలుపరచడానికి వారు మరణించడానికి సైతం లెక్కచేయలేదు. ఇది బాధాకరమైన విషయం. ఇలాంటి కేసుల్లో శిక్ష విధించేటప్పుడు సానుభుతిని దరికి చేరనీయకుండా ఉండటమే ప్రధాన నియమం."
- ఎన్​ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.

ఈ కేసును చేధించడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ప్రధాన దర్యాప్తు అధికారి ఏపీ శౌకత్అలీని న్యాయస్థానం ప్రశంసించింది.

2016లో కేసు నమోదు

ఉగ్రదాడులకు ప్రయత్నిస్తున్నారన్న అభియోగాలతో 2016 అక్టోబర్​ 1న ఎన్​ఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి ప్రణాళిక రచించడానికి కన్నూర్ సమీపంలో రహస్య సమావేశం నిర్వహించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. విదేశీయులపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు అభియోగాలు నమోదు చేశారు. కొడియాకనాల్ సమీపంలోని వట్టకనాల్​ ప్రాంతానికి సందర్శనకు వచ్చే యూదులపై దాడి చేయడానికి వారు పన్నాగం పన్నినట్లు సమాచారం. దేశంలోని ప్రముఖ వ్యక్తులు,స్థలాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఎన్​ఐఏ అభియోగాలు మోపింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding China. . Max use 2 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Haihe Educational Football Stadium, Tianjin, China. 27th November, 2019
+++ TO FOLLOW +++
SOURCE: IMG Media
DURATION: 02:48
STORYLINE:
Tianjin Tinahai avoided relegation from the Chinese Super League in some style on Wednesday, following a 5-1 thrashing of  at the Olympic Center Stadium.
Last Updated : Nov 28, 2019, 12:01 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.