రఫేల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే... ఫిబ్రవరి 27న పాకిస్థాన్ వాయుసేనతో జరిగిన పోరాటం ఫలితం మరోలా ఉండేదన్న వ్యాఖ్యలను తప్పుబట్టిన విపక్షాలపై ప్రధాని నరేంద్రమోదీ ఎదురుదాడికి దిగారు. తన వ్యాఖ్యల్ని ప్రత్యర్థులు వక్రీకరించారని గుజరాత్ జామ్‌నగర్‌లో మండిపడ్డారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మోదీ స్థానికులను ఉద్దేశించి గుజరాతీలో ప్రసంగించారు.
"రఫేల్ యుద్ధ విమానాలను సరైన సమయంలో కొనుగోలు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని నేను అన్నాను. కానీ వారు(విపక్ష నేతలు) వాయుసేన దాడులను మోదీ ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.
కాస్త ఇంగితజ్ఞానం వాడండి. ఆ(పాక్ జెట్లతో పోరాటం) సమయంలో రఫేల్ ఉండి ఉంటే మన యుద్ధ విమానం ఒకటి కూడా కూలేది కాదు. వారిది(పాకిస్థాన్‌ది) ఒక్క జెట్ కూడా మిగిలి ఉండేది కాదు."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఉగ్రవాద నిర్మూలనకు తాను కృషి చేస్తుంటే... విపక్షాలు మాత్రం తనను పదవి నుంచి తొలిగించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయని విమర్శించారు ప్రధాని.