శబరిమల అయ్యప్ప ఆభరణాల విలువ లెక్కించి నివేదిక సమర్పించేందుకు సుప్రీంకోర్టు..కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌రామచంద్ర నాయర్‌ను నియమించింది. ఆభరణాలు అయ్యప్ప ఆలయానివి కావని, అవి తమకే చెందుతాయని పందళం రాజవంశంలోని వివిధ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఆభరణాల విలువ లెక్కింపునకు రామచంద్ర నాయర్.. ఆభరణ తయారీదారుడి సహకారం తీసుకుని తన నివేదికను సీల్డు కవర్‌లో సమర్పించాలని సూచించింది.
ఆభరణాల భద్రతపై జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్‌అజయ్‌రస్తోగి, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. పందళం రాజకుటుంబంలోని వివిధ వర్గాల మధ్య సామరస్య పూర్వక పరిష్కారానికి అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ తన పదవిని ఉపయోగించుకోవాలని సూచించింది. 16 ఆభరణాలతో వేణుగోపాల్ సమర్పించిన జాబితాను పరిశీలించిన ధర్మాసనం.. ఎంతో మంది విరాళాలు ఇస్తుండగా ఇంత తక్కువ సంఖ్యలో ఉన్నాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శబరిమల ఆలయ పాలనా వ్యవహారాలపై ఓ నమూనా చట్టాన్ని రూపొందించేందుకు కేరళ ప్రభుత్వానికి సుప్రీం గడువు విధించింది.
ఇదీ చూడండి: దేశ రాజధానిలో మరోసారి కాల్పుల కలకలం