లోక్‌పాల్ జ్యుడీషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి, జస్టిస్ అభిలాష కుమారి, జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా దినేష్ కుమార్ జైన్, అర్చనా రామసుందరం, మహేందర్ సింగ్, ఇంద్రజీత్ ప్రసాద్ గౌతమ్‌లను ఎంపిక చేశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని నేతృత్వంలోని లోక్‌పాల్ ఎంపిక కమిటీ తాజా నియామకాలు చేపట్టింది. అయితే ఈ సమావేశంలో లోక్‌సభ సభాపతి పాల్గొనగా, కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపిక కమిటీలో ఒక సభ్యుడైన మల్లికార్జున ఖర్గే పాల్గొనలేదు.
అంబుడ్స్‌మన్
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లోని అవినీతి కేసులను పరిశీలించడానికి కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను నియమించాలని 2013లోనే చట్టం రూపొందించారు. నిబంధనల ప్రకారం లోక్‌పాల్ వ్యవస్థలో ఒక ఛైర్ పర్సన్, గరిష్ఠంగా ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వీరిలో కనీసం నలుగురు న్యాయ సభ్యులు ఉండాలి.