ETV Bharat / bharat

కరుణించిన వరుణుడు.. జూన్​లో అధిక వర్షపాతం

భారత్​ను వరుణుడు కరుణించాడు. గత నెలలో అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెలలో కూడా వర్షాలు బాగా కురుస్తాయని పేర్కొంది.

June records 'excess' rainfall, good precipitation expected in July: IMD
కరుణించిన వరుణుడు.. జూన్​లో అధిక వర్షపాతం
author img

By

Published : Jul 1, 2020, 8:41 PM IST

జూన్​లో అధిక వర్షపాతం నమోదు అయ్యిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ నెల కూడా ఇదే తరహాలో వర్షాలు బాగా కురుస్తాయని అంచనా వేసింది.

ఐఎండీ డేటా ప్రకారం... జూన్​లో కురిసిన వర్షపాతం దీర్ఘకాల సగటు(ఎల్​పీఏ)లో 118శాతం. అంటే వర్షాలు అధికంగా కురిసాయని అర్థం. దీనితోపాటు ఈ స్థాయిలో తేమ ఉండటం 12ఏళ్లల్లో ఇదే తొలిసారి.

90-96శాతం వర్షపాతం నమోదైతే అది సాధారణం కంటే తక్కువగాను, 96-104శాతం ఉంటే సాధారణ వర్షపాతంగాను పరిగణిస్తారు. 1961-2010 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఎల్​పీఏ 88సెంటీమీటర్లు.

గోవా, కోంకణ్​, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ ఉన్న.. మధ్య భారత సబ్​డివిజన్​లో జూన్​ నెలలో ఎల్​పీఏలో 131శాతం నమోదైంది. తూర్పు, ఈశాన్య సబ్​డివిజన్​లో ఇది 116శాతం . వాయువ్య భారతంలో 104శాతం, దక్షిణ ద్వీపకల్పంలో 108శాతం రికార్డు అయ్యింది.

రానున్న 5-10రోజుల్లో మధ్య, దక్షిణ భారతంలో వర్షాలు బాగా కురుస్తాయని అంచనా వేసింది భారత వాతావరణశాఖ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.