జనతా కర్ఫ్యూ... ప్రపంచంపై పంజా విసురుతోన్న కరోనాపై భారత్ ప్రకటించిన యుద్ధం. 14 గంటలపాటు దేశమంతా కర్ఫ్యూ పాటించి.. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని ఇచ్చిన పిలుపును ప్రజలు స్వాగతించారు.
దిల్లీ, ముంబయి, చెన్నై సహా పలు ప్రధాన నగరాలన్నీ ఉదయం నుంచే నిర్మానుష్యంగా మారాయి. ఇందుకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ, మార్కెట్లు, రోడ్లు, ఆలయాలు, దుకాణాలు, మైదానాలు.. ఇలా అన్ని మూసివేశారు. ఎటు చూసినా అంతా నిశ్శబ్దమే. అత్యవసర వస్తువుల విక్రయాలు మాత్రం జరుగుతున్నాయి.
కరోనాపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి.
ఈ రోజు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు.. 14 గంటలసేపు ప్రజలంతా తమతమ ఇళ్లలోనే స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటించాలని ప్రధాని పిలుపునిచ్చారు. సామాజిక దూరం పాటించడం ద్వారా ప్రాణాంతక కరోనా వైరస్‌కు కళ్లెం వేయాలని దేశ ప్రజలకు దిశానిర్దేశం చేశారు.
- ఇదీ చూడండి:జనతా కర్ఫ్యూను అలా గడిపేద్దాం