గుజరాత్ అహ్మదాబాద్లో అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) సభ్యులు, ప్రత్యర్థి నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) సభ్యులు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ గొడవల్లో 10 మందికి గాయాలయ్యాయి.
దిల్లీ జేఎన్యూలో ఆదివారం విద్యార్థులపై దుండగులు దాడిని తప్పుబడుతూ పాల్దీ ప్రాంతంలోని ఏబీవీపీ కార్యాలయం వద్ద ఎన్ఎస్యూఐ సభ్యులు ఆందోళనకు దిగారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ తరుణంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇదీ చూడండి:న్యూయార్క్ కోర్టులకు జడ్జీలుగా దీప, అర్చన