న్యూయార్క్ నగర క్రిమినల్, సివిల్ కోర్టులకు జడ్జీలుగా ఇద్దరు భారత సంతతి మహిళలు నియమితులయ్యారు. అర్చనా రావు క్రిమినల్ కోర్టుకు సేవలందించనున్నారు. దీపా అంబేకర్ సివిల్ కోర్టు జడ్జ్‌గా పనిచేయనున్నారు.
ఈ నియామకానికి ముందు అర్చనా రావు.. న్యూయార్క్‌లో జిల్లా అటార్నీ కార్యాలయంలో 17 సంవత్సరాలు పని చేశారు. ఇటీవల ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ బ్యూరో చీఫ్‌గా నియమితులయ్యారు. వాస్సార్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన రావు.. ఫోర్డామ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్ పట్టా పుచ్చుకున్నారు.
2019 జనవరిలో తొలిసారిగా తాత్కాలిక సివిల్ కోర్టు జడ్జ్‌గా అర్చన నియమితులయ్యారు. గతంలో ఆమె క్రిమినల్ కోర్టులోనూ సేవలందించారు.
వినూత్న సేవలందించిన అంబేకర్
దీపా అంబేకర్ మే 2018లో తొలిసారి తాత్కాలిక సివిర్ కోర్టు జడ్జ్‌గా నియమితులయ్యారు. క్రిమినల్ కోర్టులోనూ సేవలందించారు. నియామకానికి మందు న్యూయార్క్ నగర మండలిలో సీనియర్ లేజిస్లేటివ్ అటార్నీగా పనిచేశారు. ప్రజా భద్రతపై ఏర్పాటు చేసిన కమిటీకి న్యాయవాదిగా ఉన్నారు. లీగల్ ఎయిడ్ సొసైటీ, క్రిమినల్ డిఫెన్స్ డివిజన్లో స్టాఫ్ అటార్నీగా కూడా సేవలందించారు. మిషిగాన్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన అంబేకర్.. రిట్జర్స్ లా స్కూల్ నుంచి డాక్టర్ పట్టాను అందుకున్నారు.
క్రిమినల్, ఫ్యామిలీ, సివిల్ కోర్టులకు కలిపి 28మంది జడ్జీలను నియమించారు న్యూయార్క్ మేయర్ బిల్ డె బ్లాసియో. ఈ ఏడాది జనవరి 1న వీరంతా విధుల్లో చేరారు
ఇదీ చూడండి : పాకిస్థాన్ రాక్షస మిడతలతో గుజరాత్ రైతులు హడల్