ETV Bharat / bharat

మరోసారి జేఎన్​యూలో ఉద్రిక్తత.. విద్యార్థులపై దాడి

దిల్లీలోని జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్​యూ)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జేఎన్​యూ విద్యార్థులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య ఈ ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో చాలా మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వర్శిటీ అనుమతితో పోలీసులు జేఎన్​యూ ప్రాంగణంలోకి ప్రవేశించి.. పరిస్థితిని చక్కదిద్దారు.

crash
జేఎన్​యూలో విద్యార్థుల ఏబీవీపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ
author img

By

Published : Jan 5, 2020, 10:05 PM IST

Updated : Jan 5, 2020, 11:00 PM IST

దిల్లీలోని జేఎన్​యూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు.. ముఖాలకు మాస్కులు ధరించి.. విద్యార్థులపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్​ సహా చాలా మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. జేఎన్​యూ అధ్యాపకుల సంస్థ నేతృత్వంలో జరిగిన ఓ పబ్లిక్​ మీటింగ్​లో ఘర్షణ చెలరేగిందని తెలుస్తోంది. ఏబీవీపీ కార్యకర్తలు, జేఎన్​యూ విద్యార్థులకు మధ్య ఈ ఘర్షణ తలెత్తినట్లు సమాచారం.

అయితే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులపై రాళ్లు రువ్వి దాడికి పాల్పడినట్లు ఆరోపించింది విద్యార్థి సంఘం. దౌర్జన్యంగా యువతి, యవకులు వసతి గృహంలోకి ప్రవేశించి.. దాడి చేశారన్నారు.

"ఏబీవీపీ కార్యకర్తలు ముసుగులు ధరించి లాఠీలు,రాడ్​లు, సుత్తులతో కాలేజీ ప్రాంగణం చుట్టుముట్టారు. మాపై రాళ్లు రువ్వారు. దౌర్జన్యంగా వసతి గృహంలోకి ప్రవేశించి విద్యార్థులను చితకబాదారు. అధ్యాపకులపైనా దాడికి పాల్పడ్డారు."

-జేఎన్​యూ విద్యార్థి సంఘం

వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థి సంఘాలు (ఎస్​ఎఫ్​ఐ, ఏఐఎస్​ఏ, డీఎస్​ఎఫ్​) దాడికి పాల్పడినట్లు ఏబీవీపీ ఆరోపించింది.

"వసతిగృహాలలో చాలా మంది ఏబీవీపి కార్యకర్తలపై వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు 25 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. "

-ఏబీవీపి.

ఇదీ చూడండి : యూపీలో 39 మందిపై అత్యాచార కేసు పెట్టిన మహిళ!

New Delhi, Jan 05 (ANI): According to a recent study, people who spend longer than usual hours at the workplace are more susceptible to the onset of hypertension. A considerable proportion of such individuals may also suffer a hidden form of hypertension, also known as masked hypertension, which as the name suggests may go undetected in clinical settings. The new study, conducted by a Canadian research team, enlisted more than 3,500 white-collar employees at three public institutions in Quebec. These institutions generally provide insurance services to the general population. Compared with colleagues who worked fewer than 35 hours a week, working 49 or more hours each week was linked to a 70 per cent greater likelihood of having masked hypertension and a 66 per cent greater likelihood of having sustained hypertension- elevated blood pressure readings in and out of a clinical setting.

Last Updated : Jan 5, 2020, 11:00 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.