దక్షిణ కశ్మీర్‌లోని బిజ్బెహారా ప్రాంతంలో 44వ నెంబరు జాతీయ రహదారి వెంబడి 3 కిలోమీటర్ల రన్‌వే నిర్మాణాన్ని ప్రారంభించింది భారత వైమానిక దళం. రెండు రోజులు క్రితం మొదలైన పనులు యుద్ధప్రాతిపదికన జరగుతున్నట్లు అధికారులు తెలిపారు. అత్యవసర సమయంలో యుద్ధవిమానాలకు ఇది ఎమర్జెన్సీ రన్‌వేగా ఉపయోగపడుతుందన్నారు. నిర్మాణ పనుల కోసం ట్రక్కులు, కార్మికులకు జిల్లా అధికారులు పాసులు జారీ చేసినట్లు చెప్పారు.
భారత్-చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంతో అత్యవసరంగా ఈ రన్‌వే నిర్మాణాన్ని చేపట్టింది భారత వైమానిక దళం. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు ఇప్పటికే భారీగా బలగాలను మోహరించాయి.