ETV Bharat / bharat

'విచారణ పేరిట నిందితులకు కరెంట్​ షాక్​' - చైన్​పుర్​ సబ్​ డివిజన్​ పోలీస్​ అధికారి సునీల్​ కుమార్

ఝార్ఖండ్​లోని ఓ పోలీస్​ స్టేషన్​లో నిందితులను విచారించే సమయంలో వారికి విద్యుత్​ షాక్​ ఇచ్చారని ఆరోపిస్తూ.. ఇద్దరు వ్యక్తులు స్థానిక ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టారు అధికారులు.

Jharkhand police probe use of electric shock on suspects
నిందితులను ఎలక్ట్రిక్​ షాక్​కు గురిచేశారనే ఆరోపణలపై దర్యాప్తు
author img

By

Published : Oct 12, 2020, 4:40 PM IST

ఝార్ఖండ్​ పలాములోని ఓ పోలీస్​ స్టేషన్​లో నిబంధనలకు విరుద్ధంగా థర్డ్​ డిగ్రీ ఉపయోగించారనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు అధికారులు.

చైన్​పుర్​ ఠాణాలో నిందితులను విచారించే క్రమంలో వారిని ఎలక్ట్రిక్​ షాక్​కు గురిచేశారని ఇద్దరు వ్యక్తులు(రజనీకాంత్​ దుబె, వికాస్​ కుమార్​ పాసవాన్​) ఆరోపించారు. ఈ మేరకు స్థానిక ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ చర్యను అమానవీయ ఘటనగా భావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. సంబంధిత పోలీస్​ అధికారిని తొలగించాలని డిమాండ్​ చేస్తూ రోడ్డుపై బైటాయించి నిరసన చేపట్టారు. అనంతరం.. సబ్​ డివిజనల్​ పోలీస్​ అధికారి(ఎస్​డీపీఓ), చైన్​పుర్​ ఇన్​స్పెక్టర్​ న్యాయపరమైన దర్యాప్తునకు హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించుకున్నారు.

ఇదీ చదవండి: చితిలో సగం కాలిన మృతదేహాన్ని తీసుకెళ్లిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.