తబ్లిగీ జమాత్‌లో పాల్గొని, మసీదులో దాగి ఉన్న నేరానికి మూడు నెలలు జైలు శిక్ష అనుభవించిన 17 మంది విదేశీయులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది ఝార్ఖండ్‌లోని రాంచీ కోర్టు. ఈ మేరకు జస్టిస్ ఫాహీమ్ కిర్మాణి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా విస్తరిస్తోన్న తరుణంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు రూ. 2,200 చొప్పున జరిమానా కూడా విధించింది ధర్మాసనం.
వారంతా మలేసియా, బ్రిటన్, నెదర్లాండ్, జాంబియా, కరేబియన్ దీవులకు చెందిన వారుగా అధికారులు తెలిపారు. మలేసియాకు చెందిన ఓ మహిళకు కరోనా సోకినట్లు వెల్లడించారు.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఈ ఏడాది మార్చి నెలలో దిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌కు హాజరై, మసీదులో దాగున్నారని మార్చి 30న రాంచీలోని హింద్పిటిలో వారిని అరెస్టు చేశారు పోలీసులు. కేసును విచారించిన న్యాయస్థానం మూడునెలలు శిక్షతో పాటు జరిమానా విధించింది.
ఇదీ చూడండి: 'తబ్లిగీ జమాత్ వల్లే కరోనా విజృంభణ'