జమ్ము కశ్మీర్లో మరో మారు భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంత్‌నాగ్‌లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరణించారు. ఇందులో ఒక ముష్కరుడు సంస్థ కమాండర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు.
"అనంత్‌నాగ్‌లోని బిజ్బెహరాలో జైషే కమాండర్ ఫయాజ్ పంజూతో పాటు అతని సహాయకుడు ఎన్కౌంటర్లో మరణించారు. పంజూను మట్టుబెట్టడం ఓ గొప్ప విజయం."
- పోలీసు అధికారి
అనంత్‌నాగ్ పట్టణంలో జూన్ 12న జరిగిన ఉగ్రదాడిలో పంజూ కీలకంగా వ్యవహరించాడు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు ఓ పోలీసు అధికారి మృతి చెందారు.
ఇదీ చూడండి: మళ్లీ పాక్ కవ్వింపు చర్యలు.. భారత జవాను బలి