ETV Bharat / bharat

ఎస్​ఓజీ అదుపులో పాక్​ ఇంటెలిజెన్స్​ ఆపరేటివ్​ - పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్​ను అదుపులోకి తీసుకున్న ఎస్​ఓజీ

జమ్ము కశ్మీర్​లోని తారోరేలో నివాసం ఉంటూ భారత రహస్యాలను పాకిస్థాన్​కు అందిస్తున్న ఓ వ్యక్తిని ఎస్​ఓజీ అదుపులోకి తీసుకుంది. నిందితుడు సామాజిక మాధ్యమాల ద్వారా భారత వ్యూహాత్మక ప్రదేశాల సమాచారం అందిస్తున్నట్లు ఎస్​ఓజీ గుర్తించింది. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది.

pankaj sharma who was working as an operative of Pakistani intelligence agencies
పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్​ను అదుపులోకి తీసుకున్న ఎస్​ఓజీ
author img

By

Published : Mar 4, 2020, 9:48 PM IST

భారత్​లో ఉంటూ పాకిస్థాన్ గూఢచార సంస్థ కోసం పనిచేస్తున్న ఓ దుండగుడిని స్పెషల్ ఆపరేషన్​ గ్రూప్​ (ఎస్​ఓజీ) నిర్బంధించింది. గత కొన్ని సంవత్సరాలుగా అతను పాకిస్థాన్​కు భారత రహస్యాలను చేరవేస్తున్నట్లుగా ఎస్​ఓజీ వెల్లడించింది.

డబ్బు కోసం..

జమ్ము కశ్మీర్​ సాంబాలోని తారోరేలో నివాసం ఉంటున్న పంకజ్ శర్మ.. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆపరేటివ్​గా ఉన్నట్లు ఎస్​ఓజీ గుర్తించింది. ఇతను గత కొన్ని సంవత్సరాలుగా జమ్ము, సాంబా, కతువా జిల్లాల్లోని వ్యూహాత్మక ప్రదేశాల చిత్రాలు (ఫోటోలు), వీడియోలను పాకిస్థాన్​ గూఢచార సంస్థలకు అందిస్తున్నట్లు తెలుసుకుంది.

భారత్​కు చెందిన ఈ రహస్య సమాచారాన్ని పంకజ్​ శర్మ సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్థాన్​కు అందిస్తూ ఆర్థిక లబ్ధిని పొందినట్లు ఎస్​ఓజీ కనిపెట్టింది.

దర్యాప్తు

ఈ కేసు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా నిందితుడి రెండు బ్యాంకు ఖాతాల లావాదేవీలను ఎస్​ఓజీ పరిశీలించింది. మరిన్ని అనుమానాస్పద లావాదేవీలపైనా దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం ఎస్​ఓజీ... నిందితునిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు మమ్మురం చేసింది.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడి-ఎస్పీఓ సహా ఇద్దరు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.