"రాహుల్ గాంధీ ప్రసంగాల్లో అసత్య ఆరోపణల్ని పక్కనపెడితే ఇక ఏమీ ఉండదు. విపక్షాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కట్టుకథలు అల్లుతున్నాయి. ప్రజల్ని తక్కువ అంచనా వేస్తున్నాయి. ప్రజలే వారికి బుద్ధి చెబుతారు.
మోదీ ఐదేళ్ల పాలనలో ఎలాంటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోలేదు. ఆయన హయాంలో ఓటర్లు సంతృప్తికరంగా ఉన్నారు. అధికారాన్ని దక్కించుకునేందుకు మోదీని విపక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. కాంగ్రెస్ హయాంలోనే నీరవ్ మోదీ ఎదిగారు. 2011లోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను కొల్లగొట్టడం ప్రారంభించారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సైతం యూపీఏ జమానాలోనే రుణాలు మంజూరయ్యాయి."
-అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి
ఇదీ చూడండి:ఉగ్రవాదంపై చర్చకు 'బ్రిక్స్' పచ్చజెండా