కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం బాగాలేకపోవడం వల్లే చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోందన్న రాహుల్ గాంధీ విమర్శలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తిప్పికొట్టారు. అటు శక్తిమంతమైన దేశాలు, ఇటు పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగయ్యాయని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ను తాము ఎలా కట్టడి చేశామో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
కమ్యూనిస్టు చైనా ఇప్పుడే ఎందుకు దాడికి దిగిందో వివరిస్తూ రాహుల్ గాంధీ ఇదివరకే ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతినడం, ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో ఇక భారత్ ఏమీ చేయలేదనే చైనా దాడికి దిగిందని రాహుల్ వివరించారు. ఆయన విమర్శలకు జైశంకర్ ఘాటుగా సమాధానం చెప్పారు. వరుసగా ట్వీట్లు చేశారు.
-
.@RahulGandhi hs questions on Foreign Policy. Here are some answers:
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
•Our major partn’ships are strongr & internat’l standng higher.Witness regular summits&informal meetngs wth #US #Russia #Europe & #Japan.India engages #China on more equal terms politically.
Ask the analysts. https://t.co/GPf17JWSac
">.@RahulGandhi hs questions on Foreign Policy. Here are some answers:
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 17, 2020
•Our major partn’ships are strongr & internat’l standng higher.Witness regular summits&informal meetngs wth #US #Russia #Europe & #Japan.India engages #China on more equal terms politically.
Ask the analysts. https://t.co/GPf17JWSac.@RahulGandhi hs questions on Foreign Policy. Here are some answers:
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 17, 2020
•Our major partn’ships are strongr & internat’l standng higher.Witness regular summits&informal meetngs wth #US #Russia #Europe & #Japan.India engages #China on more equal terms politically.
Ask the analysts. https://t.co/GPf17JWSac
"మా భాగస్వామ్యాలు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. అమెరికా, రష్యా, ఐరోపా, జపాన్‌తో నిరంతరం సదస్సులు, చర్చలు జరుగుతున్న సంగతిని తెలుసుకోండి. రాజకీయంగా చైనాతో భారత్ సమానంగా వ్యవహరిస్తోంది. విశ్లేషకులను అడిగి తెలుసుకోండి. మేం చాలా స్పష్టంగా, బహిరంగంగా మా అభిప్రాయాలు చెబుతాం. సీపెక్, బెల్డ్ అండ్ రోడ్, దక్షిణ చైనా సముద్రం, ఐరాస నిషేధించిన ఉగ్రవాదులపై స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పాం. మీడియాను అడిగి తెలుసుకోండి. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను వృద్ధి చేశాం. 2014-20ని 2008-14 సంవత్సరాల మధ్య పరిస్థితిని పోల్చండి. కేటాయింపులు 280% పెరిగాయి, రహదారుల నిర్మాణం 32%, వంతెనలు 99%, టన్నెల్స్‌ను 6 రెట్లు ఎక్కువగా చేశాం. మన జవాన్లను అడగండీ విషయాల్ని"
-జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
పొరుగు దేశాలతో సంబంధాల గురించీ జైశంకర్ వివరించారు. చైనా, శ్రీలంక మధ్య కుదిరిన హంబన్‌తోట నౌకాశ్రయం ఒప్పందం 2008లో నిలిచిపోయిందన్నారు. బంగ్లాదేశ్‌తో 2015లో సరిహద్దు సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకున్నాక మరింత అభివృద్ధి, రవాణా పెరిగిందని తెలిపారు. అది తమకు స్వర్గధామం కాదని ఉగ్రవాదులు గ్రహించారని చెప్పారు.
'ప్రజలను అడగండి'
ఇక నేపాల్ విషయానికి వస్తే 17 సంవత్సరాల తర్వాత ప్రధాన మంత్రులు పర్యటిస్తున్నారని, విద్యుత్, ఇంధన, గృహ నిర్మాణం, ఆస్పత్రులు, రహదారుల నిర్మాణాల గురించి అక్కడి ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. భూటాన్ మరింత బలమైన రక్షణ, అభివృద్ధి భాగస్వామిగా మారిందన్నారు. అఫ్గాన్‌లో సల్మా డ్యామ్, పార్లమెంట్ నిర్మాణాలన్నీ భారత్ ఆధ్వర్యంలో పూర్తయ్యాయని జైశంకర్ తెలిపారు. శిక్షణ, అనుసంధానం మెరుగైందని వివరించారు.
'ఇక పాకిస్థాన్ (మీరు చెప్పడం దాటవేశారు). బాలాకోట్, ఉరి ఘటనల తర్వాత భారత ప్రతిస్పందన,, 26/11 దాడుల తర్వాత స్పందనకు మధ్య తేడాను మీరు స్పష్టంగా గుర్తించొచ్చు. ఇది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి' అని రాహుల్‌ను జైశంకర్ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి- 'కేంద్రం అసమర్థత వల్లే చైనా దూకుడు'