కశ్మీర్ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది సాధారణ పరిపాలనా విభాగం(జీఏడీ). 2021లో జరగబోయే జనాభా లెక్కింపునకు సమన్వయ కమిటీగా వ్యవహరించనుంది ఈ ప్యానెల్.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు కశ్మీర్ జీఏడీ ఉప ప్రధాన కార్యదర్శి గిరిధరి లాల్.
2011 అధికారిక గణాంకాల ప్రకారం జమ్ముకశ్మీర్ జనాభా 1,25,41,302. ఇందులో 66,40,662 మంది పురుషులు. 59,00,640 మంది మహిళలు. పురుషులు, మహిళల నిష్పత్తి 1000:889గా ఉంది. కశ్మీర్లో అక్షరాస్యత 67.16 శాతం. పురుషుల్లో 76.75శాతం మంది అక్షరాస్యులు. మహిళల అక్షరాస్యత శాతం 56.43.
ఇదీ చూడండి: దావూద్, మసూద్లను ఉగ్రవాదులుగా ప్రకటించిన హోంశాఖ