ETV Bharat / bharat

సుదీర్ఘ చర్చ అనంతరం మళ్లీ సోనియాకే పగ్గాలు - సీడబ్ల్యూసీ సమావేశం వార్తలు

నాయకత్వ మార్పుపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. సోనియాగాంధీనే అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు పార్టీ బాధ్యతల్లో కొనసాగాలని తీర్మానం చేసింది. అయితే 23 మంది సీనియర్లు రాసిన లేఖపై సీడబ్ల్యూసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక దశలో భాజపాతో కుమ్మక్కై లేఖ రాశారని సీనియర్‌ నేత ఆజాద్‌ లక్ష్యంగా రాహుల్‌ విమర్శలు చేశారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఆజాద్‌ కూడా తోసిపుచ్చారు.

Congress debates leadership
సోనియాకే పగ్గాలు
author img

By

Published : Aug 24, 2020, 10:22 PM IST

కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీలో మెజార్టీ నేతలు సోనియాగాంధీ నాయకత్వంపై విశ్వాసం కనబరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు ఏడు గంటలు వాడీవేడీగా సాగిన ఈ భేటీలో తిరిగి సోనియాకే పగ్గాలు అప్పగించారు. మొత్తం 48 మంది నాయకులు పాల్గొన్న సీడబ్ల్యూసీ సమావేశంలో.. తాత్కాలిక అధ్యక్షురాలి బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఇవ్వాలని సోనియాగాంధీ కోరారు. పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎంపికచేసే ప్రక్రియ.. ప్రారంభించాలని సూచించారు.

గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే.. మాజీ ప్రధాని మన్మోహన్, ఏకే ఆంటోనీ వంటి నాయకులు.. అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరగా అందుకు ఆమె తిరస్కరించారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ పదవిలో కొనసాగాలని సోనియా గాంధీని మన్మోహన్, ఆంటోనీ సహా ఇతర సీనియర్లు కోరారు. అందుకు సోనియా అంగీకరించారు.

సీనియర్ల లేఖపై రగడ..

ఇదే సమయంలో క్రియాశీలంగా, పూర్తిస్థాయిలో ఉండే నాయకత్వం కావాలంటూ 23 మంది సీనియర్ నేతలు రాసిన లేఖను మన్మోహన్‌, ఆంటోనీ, అంబికా సోనీ వంటి నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా లేఖపై సంతకం చేసిన సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ లక్ష్యంగా సభ్యులు విమర్శలు గుప్పించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌ గాంధీ లేఖ రాసిన సమయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో లేఖ రాసిన వారు భాజపాతో కుమ్మక్కయ్యారని రాహుల్ వ్యాఖ్యానించినట్లు ప్రచారం కావటం కాంగ్రెస్​లో తీవ్ర దుమారానికి దారితీసింది.

సోనియా ఏకగ్రీవం..

ఈ పరిణామాల నడుమ కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాలని పి.చిదంబరం సూచించారు. చాలా మంది సభ్యులు సోనియాగాంధీనే కొనసాగాలని కోరగా, మరికొందరు రాహుల్‌ను పగ్గాలు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ముప్పేట విమర్శలతో లేఖపై సంతకం చేసిన నాయకులు మౌనం దాల్చగా, సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగాలని తీర్మానం చేసింది.

ఏఐసీసీ భేటీ వరకు సోనియానే సారథి..

వర్కింగ్ కమిటీ సమావేశంలో నాయకత్వ మార్పుపై 7 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. సోనియాగాంధీనే అధ్యక్షురాలిగా కొనసాగాలని సభ్యులు కోరారని, అందుకు ఆమె అంగీకరించినట్లు వెల్లడించారు.

"కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ 7 గంటలపాటు జరిగింది. మీడియాలోకానీ, బహిరంగంగానీ పార్టీ అంతర్గత విషయాలు చర్చించరాదని సీడబ్యూసీ నిర్ణయించింది. పార్టీ ప్రయోజనాలు పరిరక్షిస్తూ క్రమశిక్షణతో అంతర్గత విషయాలను పార్టీ వేదికలపైనే ప్రస్తావించాలని.. అందరినీ సీడబ్యూసీ కోరింది. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనే నిమిత్తం అవసరమైన సంస్థాగత మార్పులు చేసేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలికి సీడబ్ల్యూసీ అధికారం కట్టబెట్టింది. పరిస్థితులు అనుకూలించి.. ఏఐసీసీ సమావేశం నిర్వహించే వరకూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగాలని సోనియాగాంధీని సీడబ్యూసీ ఏకగ్రీవంగా కోరింది."

- కేసీ వేణు గోపాల్

ఏఐసీసీ భేటీలో అధ్యక్ష ఎన్నిక

కాంగ్రెస్ అనేది పెద్ద కుటుంబమని, అభిప్రాయ భేదాలు సహజమని పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా వెల్లడించారు. లేఖ రాసిన నేతలపై ఎలాంటి కోపం లేదని సోనియా చెప్పినట్లు పేర్కొన్నారు. అవకాశం చూసుకుని ఏఐసీసీ పూర్తి సమావేశం నిర్వహిస్తామని, అదే భేటీలో అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు.

ఆజాద్​ నివాసంలో సీనియర్ నేతలు..

సీడబ్ల్యూసీ భేటీ ముగిసిన అనంతరం గులాం నబీ ఆజాద్​ నివాసానికి పలువురు సీనియర్ కాంగ్రెస్​ నేతలు వెళ్లారు. వీరిలో ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, మనీశ్ తివారీ, శశిథరూర్, ముకుల్ వాస్నిక్​​ తదితరులు ఉన్నారు. సీడబ్ల్యూసీ భేటీలో సీనియర్ల లేఖపై చర్చ దృష్ట్యా వీరి సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో నాయకత్వ సంక్షోభం కొత్తేమీ కాదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.