ETV Bharat / bharat

వేలంలో కోట్లు పలికిన జగ్గీ వాసుదేవ్​ పెయింటింగ్ - online-auction

ఈశా ఫౌండేషన్​ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ వేసిన​ పెయింటింగ్​ వేలంలో రూ.5.1 కోట్ల ధర పలికింది. వేలంలో ఉంచిన సద్గురు కళాకృతుల్లో ఇది రెండోది. మొదటి చిత్రపటానికి రూ. 4.14 కోట్లు వచ్చాయి. మొత్తం రెండు పెయింటింగ్​ల నగదును ఈశా ఫౌండేషన్​ ఆధ్వరంలో చేపడుతోన్న కరోనా ఉపశమన కార్యక్రమాలకు అందించారు.

Isha founder's painting
వేలంలో కోట్లు పలికిన 'ఈశా' ఫౌండర్​ పెయింటింగ్!
author img

By

Published : Jul 7, 2020, 5:53 PM IST

ఈశా ఫౌండేషన్​ వ్యవస్థాపకులు శ్రీ సద్గురు జగ్గీ వాసుదేవ్.. 'భైరవ' పేరుతో వేసిన పెయింటింగ్​ వేలంలో కోట్లు పలికింది. నెల రోజుల క్రితం ఆన్​లైన్​ వేలంలో ఉంచగా.. సోమవారంతో ఆ ప్రక్రియ ముగిసింది. ఈ పెయింటింగ్​కు రూ. 5.1 కోట్ల రూపాయలు పలికినట్లు తెలిపింది సంస్థ. ఈ నగదు మొత్తం ఈశా ఫౌండేషన్​ ఆధ్వర్యంలోని కొవిడ్​-19 రిలీఫ్​ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు పేర్కొంది.

Isha founder's painting
భైరవ పెయింటింగ్​

" ఈశా ఫౌండేషన్​ సేవా కార్యక్రమాలకు అందించిన సద్గురు కళాకృతుల్లో ఇది రెండోది. సేవా కార్యక్రమాల్లో భాగంగా కరోనా పోరులో ముందుండి పోరాడుతోన్న ఆరోగ్య సిబ్బందికి వ్యక్తిగత భద్రతా కిట్లు, ఐసోలేషన్​ వార్డుల్లో మౌలిక వసతుల కల్పన, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహారం, రోగనిరోధక శక్తి పెంచే పానీయాలను అందిస్తోంది."

- ఈశా ఫౌండేషన్​

చిత్రపటానికి ఆవు పేడ, బొగ్గు, పసుపు, సున్నపురాయిని వినియోగించారు సద్గురు. ఈశా ఫౌండేషన్​లో సద్గురుకు ఇష్టమైన ఓ ఎద్దు మృతికి నివాళిగా పెయింటింగ్​ వేశారు జగ్గీ వాసుదేవ్​. ఆ వృషభం గత ఏప్రిల్​లో మృతి చెందింది.

Isha founder's painting
పెయింటింగ్​ వేస్తోన్న సద్గురు

సద్గురు వేసిన తొలి పెయింటింగ్​ 'లివ్​ టోటల్లీ' వేలంలో రూ. 4.14 కోట్లు సంపాదించింది. ఈ మొత్తాన్ని కరోనా ఉపశమన సేవా కార్యక్రమాలకు అందించారు. రెండు పెయింటింగ్​ల ద్వారా మొత్తం రూ. 9 కోట్లకుపైగా విరాళం ఇచ్చారు సద్గురు.​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.