ETV Bharat / bharat

ఒత్తిడిలేని జ్ఞానవికాసానికి ఎన్నదగిన మార్గాలెన్నో..

అక్షరాలు వికసించాల్సిన జ్ఞానవనాల్లో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రఖ్యాతిగాంచిన ఐఐటీలు, ఐఐఎమ్‌లు, కేంద్రీయ విద్యాలయాలు, జాతీయ విద్యాసంస్థల్లో సైతం విద్యార్థులు బలవన్మరణాల దిశగా ఎందుకు సాగుతున్నారు? మన విద్యావిధానంలో లోపాలే కారణమా? ఇప్పుడున్న విద్యావ్యవస్థ నుంచి ప్రత్యామ్నాయాలవైపు అడుగులు పడాల్సిన అవసరం ఉందా? భారత ప్రభుత్వం సంకల్పిస్తున్న నూతన విద్యావిధానంలోనైనా అవసరమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందా?

ఒత్తిడిలేని జ్ఞానవికాసానికి ఎన్నదగిన మార్గాలెన్నో...
author img

By

Published : Nov 14, 2019, 8:55 AM IST

నేటి బాలలే రేపటి పౌరులు. ఆడుతూపాడుతూ ఉల్లాసంగా గడపాల్సిన ఈ తరం బాలబాలికలపై చదువులపరంగా ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. ఇది అవాంఛనీయ పరిణామం. దేశ ప్రథమ ప్రధాని చాచా నెహ్రూ కన్న కలలకు అతి దూరంగా వెళ్తున్న విద్యారంగ పోకడల్లో పెనుమార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

ఒత్తిడిలేని జ్ఞానవికాసానికి ఎన్నదగిన మార్గాలెన్నో...
ఒత్తిడిలేని జ్ఞానవికాసానికి ఎన్నదగిన మార్గాలెన్నో...

మార్పులకు దూరంగా..

విద్యార్థిలో నిబిడీకృతమై ఉన్న సహజమైన శక్తియుక్తులను వెలికితీసి, సామాజిక, ఆర్థిక వికాసానికి తోడ్పడే ప్రక్రియే ‘విద్య’ అంటారు స్వామి వివేకానంద. విద్య-వైయక్తిక వృద్ధితోపాటు దేశాభివృద్ధికి దోహదపడుతుంది. విలువైన మానవ వనరులను ఉపయుక్తంగా తీర్చిదిద్దడంలో చదువు పాత్ర కీలకం. సామాజికాభివృద్ధికి కేంద్రబిందువైన విద్యావిధానంలో సమయానుసారంగా మార్పులు చేపట్టాల్సి ఉండగా, పాలక గణాలు ఆ విషయాన్ని విస్మరించడం ఆందోళనకరం. మన విద్యారంగం ఎంతో కాలంగా మార్పులు, చేర్పులకు దూరంగా ఉండిపోయింది. నైపుణ్యం కరవై, కేవలం పట్టాలు అందించే పరిశ్రమగా మారిపోయింది. ఈ క్రమంలో కొత్త విధానాల్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సహజంగా, ఎలాంటి ఒత్తిడీ ఉండని వాతావరణంలో విద్య నేర్పించాలని విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సూచించారు. తద్వారా వ్యక్తి సంపూర్ణ వికాసం సాధ్యపడుతుందన్నది ఆయన ఉద్దేశం.

కాలానుగుణంగా కొత్త పద్ధతులు

ఎలాంటి ఒత్తిళ్లూ ఉండని అభ్యసన వ్యవస్థ సాధ్యమేనా? కొన్ని కొత్త పద్ధతులు ఇది సాధ్యమేనంటున్నాయి. ఇప్పుడున్న విద్యావిధానం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లేదన్న ఆలోచన నుంచి పుట్టిన సరికొత్త భావనే ‘అన్‌స్కూలింగ్‌’. ఇందులో విద్యార్థులు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమకు నచ్చిన రీతిలో విద్యను అభ్యసించే వెసులుబాటు ఉంటుంది. ఆస్ట్రియన్‌ తత్వవేత్త ఇవాన్‌ పారంపర్య విద్యావిధానాన్ని విమర్శిస్తూ ‘ఓపెన్‌ లెర్నింగ్‌,’ ‘అన్‌ స్కూలింగ్‌’ అన్న భావనలను పరిచయం చేశారు. ఆ తరవాత ‘ఫాదర్‌ ఆఫ్‌ అన్‌స్కూలింగ్‌’గా చిరపరిచితులైన అమెరికా విద్యావేత్త జాన్‌ హోల్ట్‌ ఈ విధానాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. పారంపర్య విద్యావిధానం పిల్లల్లో ఎదుగుదలను నిరోధిస్తుందని, స్వీయ ప్రేరణ, తెలుసుకోవాలనే ఆసక్తి, సృజనాత్మక శక్తిని హరించివేస్తుందన్నది ఆయన అభిప్రాయం. ఈ విధానంలో తల్లిదండ్రుల తోడ్పాటు, మార్గనిర్దేశం, సలహాల ఆధారంగా పిల్లలు తమకు నచ్చిన రంగాలనే ఎంచుకుని వాటిలో ప్రావీణ్యం సాధిస్తారన్నది ఆయన నమ్మకం. మానసికపరమైన వెసులుబాటు, స్వీయ అభ్యసన, జీవిత పాఠాలు వంటి మూడు ప్రాథమిక అంశాల ఆధారంగా ఈ పాఠశాలలు పని చేస్తాయి. ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్నారు. అమెరికాలో దీనికి మంచి గుర్తింపు ఉంది. కెనడా చురుగ్గా ప్రోత్సహిస్తోంది. భారత్‌ సైతం పాక్షికంగా చట్టబద్ధత కల్పించింది. ప్రపంచ విద్యా సూచీలో మొదటిస్థానంలో ఉన్న ఫిన్లాండ్‌లో ఈ విద్యావిధానం చట్టబద్ధమే. ఈ కోవకు చెందిన మొట్టమొదటి పాఠశాలను సడ్బరీ వ్యాలీ స్కూల్‌ పేరిట అమెరికాలో ఏర్పాటు చేశారు. తరవాత కాలంలో ఆ భావన చాలా దేశాలకు విస్తరించింది. గ్రీన్‌లాండ్‌, టర్కీ, జర్మనీ, గ్రీస్‌ వంటి దేశాలు మాత్రం వివిధ కారణాలతో ఈ విధానాన్ని నిషేధించాయి. కొత్త విద్యావిధానం తరహాలో 1998లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు చెందిన మనీష్‌ జైన్‌ మన దేశంలో విద్యావిధానాన్ని మార్చాలని ప్రచారం చేస్తూ ‘శిక్షాంతర్‌’ అనే ఉద్యమం ప్రారంభించారు. ప్రత్యామ్నాయ విద్యావిధానంగా తన సహచరులతో కలిసి ఉదయపూర్‌లో ‘స్వరాజ్‌ యూనివర్సిటీ’ని ఏర్పాటుచేశారు. అక్కడ కేవలం నైపుణ్యాంశాల ఆధారంగా వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తారు.

పాఠశాలల్లోనే అభ్యసన అవసరమా

ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం వివిధ కారణాలతో తల్లిదండ్రులు అన్‌స్కూలింగ్‌ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కేవలం పాఠశాలల్లోనే నేర్చుకోనక్కర్లేదని, ఎక్కడైనా అభ్యసించవచ్చన్నది తల్లిదండ్రుల అభిప్రాయం. పిల్లల్లో తక్కువ గ్రహణశక్తి, వినికిడి లోపం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పాఠ్యాంశాలను మాత్రమే బోధిస్తే సృజనాత్మకత దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు. పాఠశాలల యాజమాన్యాల అజమాయిషీ ధోరణి, విద్యార్థికి స్వేచ్ఛ లేకపోవడం, బడికెళ్లేందుకు సుదీర్ఘ ప్రయాణం, సంచుల బరువు, అధిక రుసుములు, దండన, గ్రేడ్లు, ర్యాంకులు, మదింపు వంటి వ్యవహారాలతో పిల్లల్లో ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి చదువులతో ప్రకృతి ప్రతి వ్యక్తికీ స్వతహాగా ప్రసాదించిన వ్యక్తిత్వం, సృజనాత్మకత నశిస్తోందన్న భావన ప్రబలుతోంది. అందువల్లే ఓపెన్‌ లెర్నింగ్‌, జాయ్‌ లెర్నింగ్‌, హోమ్‌ లెర్నింగ్‌, అన్‌స్కూలింగ్‌ వంటి, కొత్త విద్యావిధానాలపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. దిల్లీ, పుణె, బెంగళూరు, చెన్నై, ముంబయిల్లో ఈ విద్యావిధానం వేగంగా విస్తరిస్తోంది. బెంగళూరులో అన్‌స్కూలింగ్‌ విధానంలో పేరుపొందిన పాఠశాలలకు అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఇందులో సేంద్రియ సాగు పద్ధతి, సౌర ప్రాజెక్టులు, లలితకళలు, చిత్రనిర్మాణం, ఛాయాగ్రహణం, వ్యాపార నిర్వహణ వంటి అంశాల ద్వారా పిల్లల అభ్యసన ప్రక్రియ సాగుతుంది. పుస్తక పఠనం, ప్రయాణాలు, మార్గదర్శకులు, కుటుంబం, పరస్పర సంభాషణలు వంటి ప్రక్రియలతోనూ చిన్నారులు ఎంతో నేర్చుకునే అవకాశం ఉంది. మనదేశంలో ప్రస్తుత విద్యావిధానాన్ని పలురకాల లోపాలు వెక్కిరిస్తున్నాయి. పీహెచ్‌డీ పూర్తి చేసినవారు బంట్రోతు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం, ఇంజినీరింగ్‌ చదివినవారూ ఎలాంటి నైపుణ్యాలు లేకుండా ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టడం, చిన్నచిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడటం వంటివి విద్యావ్యవస్థలో డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్నాయి. 130 కోట్లకుపైగా జనాభాగల భారత్‌లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం చాలా ఉంది. చైనా, జపాన్‌లలో మాదిరిగా విద్యార్థులకు స్వతహాగా బతికే నేర్పు, నైపుణ్యాభివృద్ధి చిన్నతనం నుంచే అలవడేలా పరిస్థితుల్ని మార్చగలిగితే నిరుద్యోగ సమస్య తీవ్రతను కొంతవరకైనా తగ్గించవచ్చు. సమాజంలో కొన్ని వర్గాల ప్రజలు కొన్ని విషయాల్లో ప్రత్యేక నైపుణ్యాల్ని కలిగి ఉన్నారు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల అడవుల్లో చెంచులు విలువిద్య, అటవీ ఉత్పత్తుల సేకరణలో, మధ్యప్రదేశ్‌లోని ఆదివాసీ సమూహాలు గిరిజన వైద్యంలో ఆరితేరారు. వారిని సరైన రీతిలో ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సమకూరుతాయి.

స్వీయ ప్రతిభకు సాన

నైపుణ్య భారత్‌, భారత్‌లో తయారీ, ముద్ర తదితర ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో నైపుణ్యాల విస్తృతికి అవకాశాలు అపారమనే చెప్పాలి. కేవలం విద్యార్హతలు, పట్టాలపైనే దృష్టి పెట్టకుండా సాధారణ వ్యక్తుల్లో సైతం నైపుణ్య వృద్ధిని సాధించగలిగితే ఆధునిక భారత్‌ను వేధిస్తున్న సమస్యలు సగం పరిష్కారమైనట్లే. చదువు తక్కువ ఉన్నా తమలోని నిగూఢ నైపుణ్యాలను వెలికితీసి, వాటికి పదును పెట్టుకొని వివిధ రంగాల్లో ఖ్యాతి పొందినవారు అనేకం. విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, కంప్యూటర్ల దిగ్గజం బిల్‌ గేట్స్‌, ఫోర్డ్‌ కార్ల సంస్థ అధినేత హెన్రీ ఫోర్డ్‌, బిర్లా సంస్థల అధిపతి ఘనశ్యామ్‌దాస్‌ బిర్లా, పారిశ్రామిక దిగ్గజాలు ధీరూభాయ్‌ అంబానీ, అజీం ప్రేమ్‌జీ, గౌతమ్‌ ఆదానీ, క్రీడా ప్రముఖులు మేరీకోమ్‌, సచిన్‌ తెందూల్కర్‌, అందాల రాణి ఐశ్వర్యరాయ్‌ వంటివారు ఈ విషయంలో మనకు ఉదాహరణలుగా నిలుస్తూ, తమ విజయగాథలతో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతున్నవారే. చిన్నతనం నుంచే వైయక్తిక ప్రతిభాసామర్థ్యాలను గుర్తించగలిగితే నైపుణ్య భారత్‌ దిశగా మన అడుగులు మరింత బలంగా పడతాయన్న సంగతిని విస్మరించరాదు. ప్రాథమిక విద్య స్థాయిలో పిల్లల్లో అభిరుచుల్ని వెలికితీసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక సంబంధ పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదన సైతం ఆశావహ పరిణామం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి పరీక్షలు సర్వసాధారణం. ఇందుకు కావాల్సిందల్లా ఉన్న అవకాశాలను, వనరులను ప్రయోజనకర రీతిలో ఉపయోగించుకోవడమే. సామాజిక సమస్యలు, ఆర్థిక అసమానతలుండే అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో నూతన విద్యావిధానం ఒక రకంగా మేలు చేస్తుందనే భావించాలి. కొత్త విద్యావిధానం వైపు వేస్తున్న ఈ అడుగులు స్థిరపడితే- దశాబ్దాలుగా దేశాన్ని పట్టికుదుపుతున్న సామాజిక, ఆర్థిక సమస్యలనుంచి భారతావనిని గట్టెక్కించడం సాధ్యమే!

అనుకూలతలు

పిల్లల్లో సామాజికీకరణ రెండేళ్ల వయసులో మొదలవుతుంది. తమ తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం, అనుకరణ వంటి ప్రక్రియలతో వారికి అనేక విషయాలు తెలిసొస్తాయి. అన్‌స్కూలింగ్‌ ప్రక్రియలో ఉండే చిన్నారులు తోటి పిల్లలతో కలిసే అవకాశం ఉండదు. ఫలితంగా అవసరమైన స్థాయిలో సమాజంతో మమేకమయ్యే అవకాశాలు తగ్గుతాయి. సాంకేతిక పరిజ్ఞానం విరివిగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో పిల్లలు ఎలక్ట్రానిక్‌ పరికరాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. చిన్న కుటుంబాలు పెరుగుతున్న తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయం కేటాయించగలరా అన్నది ప్రశ్నార్థకం! సాంకేతిక పరిజ్ఞానం రాకతో మానవ సంబంధాలు, విలువలు కొడిగడుతున్న తరుణంలో సమాజంలోనే ఉంటూ దానికి దూరంగా ఉండే అన్‌స్కూలింగ్‌ విద్యార్థులు ‘సామాజిక నిరక్షరాస్యులు’గా మిగిలిపోయే ప్రమాదం ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
-డాక్టర్ రమేష్ బుద్దారం (రచయిత-మధ్యప్రదేశ్​లోని గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు)

Coimbatore (Tamil Nadu), Nov 14 (ANI): Around 5-6 elephants entered in a residential area in Coimbatore. They were seen chasing street dogs. The elephants entered in Periyanaickenpalayam village on November 13.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.